భూమా మౌనిక కొత్త అవతారం...

మంచు మనోజ్( Manchu Manoj ) హీరో గా తెలుగు చాలా సినిమా లు చేశాడు ప్రస్తుతం అయిన అటు రాజకీయాలా, ఇటు సినిమా నా ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేకుండా ఉంటున్నాడు.

అయితే తాజాగా ఇంటి వాడిగా మారిన సంగతి తెలిసిందే.

భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వీరి ప్రేమకథను కూడా చెప్పుకొచ్చారు.

వాళ్ల కథ విని అందరూ వావ్ అన్నారు.మనోజ్ కూడా వీలైనంత వరకు భార్యపై తనకున్న ప్రేమను చాటుతూ వస్తున్నాడు.

తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ( International Yoga Day )సందర్భంగా ఆమె యోగా చేస్తుండగా ఓ ఫోటో క్లిక్ మనిపించాడు.ఆ ఫోటోను కూడా షేర్ చేశారు.

Advertisement

ఆ ఫోటోలో, మౌనిక ఏకపాద రాజకపోతాసనం అనే కొంచెం కష్టమైన యోగాసనాన్ని చేసింది.

ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.యోగా డే కావడంతో సెలబ్రెటీలంతా యోగా పోజులు వేస్తూ ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.అలా భూమా మౌనిక కూడా తన యోగా ఫోటోను పంచుకున్నారు.

అలాగే మనోజ్ కూడా ఈ ఫోటోను షేర్ చేశాడు.నా భార్య భూమా మౌనిక యోగా ఫోటోలను గర్వంగా పంచుకుంతున్నాను అని అయన పేర్కొన్నారు.

అయితే ఆమె ఈ యోగాసనాన్ని చేయడమే కాదు, 108 సూర్య నమస్కారాలు( 108 Sun Salutations ) కూడా చేసింది.ఈ విషయాన్ని మౌనిక తన పోస్ట్‌లో తెలియజేసింది.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

తన తల్లి శోభానాగిరెడ్డి ( Sobhanagi Reddy )తనకు యోగాను పరిచయం చేశారని కూడా చెప్పారు.తనకు యోగాను పరిచయం చేసినందుకు తల్లికి కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

మనోజ్ భూమా, మౌనికులకి ఇది రెండో పెళ్లి.మౌనిక కంటే ముందే మనోజ్ మరో అమ్మాయి ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు.

మౌనిక కు కూడా గతంలో ఓ వ్యాపారవేత్తతో వివాహం కూడా జరిగింది.వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.

అయితే అతడితో విడిపోయిన తర్వాత మనోజ్‌ని పెళ్లి చేసుకుంది.మనోజ్ తన కొడుకు బాధ్యతలను కూడా తీసుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే 2024 ఎలక్షన్స్ లో మౌనిక మనోజ్ ఇద్దరు కలిసి పోటీ చేయబోతున్నారు అనే విషయం కూడా స్పష్టం గా తెలుస్తోంది.చూడాలి మరి ఏం జరుగుతుందో.

తాజా వార్తలు