విలనిజం చూపించడానికి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాతో హీరోయిన్ గా కెరియర్ ఆరంభించిన భూమిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఖుషి సినిమాతోనే ఆమె ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఓ వైపు హీరోలకి జోడీగా సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఒరియాంటెడ్ కథలతో కూడా సత్తా చూపించింది.కెరియర్ బాగున్న సమయంలోనే యోగా ట్రైనర్ భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకుంది.

Bhoomika Turned As A Lady Villain-విలనిజం చూపించడ�

ఆ తర్వాత నిర్మాత అవతారం ఎత్తి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకుంది.అయితే చాలా గ్యాప్ తర్వాత మరల తన సెకండ్ ఇన్నింగ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

నాని ఎంసిఎ, బాలకృష్ణ రూలర్ సినిమాలలో కీలక పాత్రలు చేసింది.ఇప్పుడు మరో మూడు సినిమాలకి సైన్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Advertisement

ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకుంది.నాకు నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లంటే చాలా ఇష్టం.

మిస్స‌మ్మ‌లో నా పాత్ర అలానే సాగుతుంది.కానీ చివ‌ర్లో క‌థంతా మారిపోతుంది.

ఈసారి చివ‌రి వ‌ర‌కూ నెగిటీవ్ ట‌చ్‌లోనే నా పాత్ర సాగుతుంది.ఓ ర‌కంగా చెప్పాలంటే అది లేడీ విల‌న్ పాత్ర‌.

అయితే ఆ సినిమా పేరు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాక చెబుతా అని స్పష్టం చేసింది.దీనిని బట్టి తెలుగులో మరో అందాల భామ తన విలనిజం చూపించడానికి సిద్ధమవుతుందని ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!
Advertisement

తాజా వార్తలు