భీష్మ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘భీష్మ’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో మరో సూపర్‌హిట్‌పై కన్నేశాడు నితిన్.ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ చిత్రంపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేశాయి.అయితే ఈ సినిమా తాజాగా ప్రీరిలీజ్ బిజినెస్‌ పూర్తి చేసుకుని చిత్ర నిర్మాతలకు రిలీజ్‌కు ముందే మంచి లాభాలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, రూ.35 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌ను చేసి నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడటంతో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 45 కోట్లు ఆంధ్ర - 8 కోట్లు సీడెడ్ - 2 కోట్లు మిగతా ప్రాంతాలు - 5.5 కోట్లు నాన్-థియేట్రికల్ - 15 కోట్లు టోటల్ ప్రీరిలీజ్ బిజినెస్ - 35 కోట్లు.

Advertisement
మనిషి చివరి క్షణాలలో.. ఈ వస్తువులు దగ్గర్లో ఉంటే స్వర్గం ఖాయం..!

తాజా వార్తలు