యూట్యూబ్‌ను ఆడేసుకుంటున్న భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ టీజర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ టీజర్ ఉండటంతో వారు ఈ టీజర్‌ను యూట్యూబ్‌లో చెడుగుడు ఆడేస్తు్న్నారు.ముఖ్యంగా లుంగీ కట్టులో పవన్ పవర్ ప్యాక్డ్ డైలాగులు పవన్ ఫ్యాన్స్‌కు పీకలవరకు ఎక్కేశాయి.

అంతే.ఇక ఈ టీజర్‌తో యూట్యూబ్ రికార్డుల భరతం పట్టే పనిలో వార నిమగ్నమైపోయారు.ఇప్పటికే ఈ టీజర్ పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండగా, తాజాగా రిలీజ్ అయిన అతి తక్కువ గంటల్లో ఏకంగా 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న టీజర్‌గా భీమ్లా నాయక్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.ఇక ఈ టీజర్‌కు దాదాపు 550K లైకులు కూడా రావడం విశేషమని చెప్పాలి.

మొత్తానికి పవన్ మేనియాతో ఊగిపోతున్న ఆడియెన్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ తమ ప్రతాపం చూపుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు.

Advertisement

అయితే ఈ టీజర్‌లో రానా వాయిస్ తప్ప మనిషి కనిపించలేదు.దీంతో భీమ్లా నాయక్ టీజర్‌పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

వారందరికీ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అదిరిపోయే రేంజ్‌లో యాన్సర్ ఇచ్చాడు.ప్రతి విషయానికి ఒక సమయం అంటూ ఉంటుందని, అప్పుడు అన్నీ బయటకొస్తాయని ఆయన అన్నారు.

ఇక థమన్ అందించిన బీజీఎంకు పవన్ పర్ఫార్మెన్స్ తోడవడంతో పవన్ అభిమానులు ఊగిపోతున్నారు.మొత్తానికి భీమ్లా నాయక్ పెద్ద స్కెచ్ వేసుకునే రంగంలోకి దిగాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.

న‌ల్ల‌ని పాదాల‌ను తెల్ల‌గా మార్చే ట‌మాటా..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు