భీమ్లా నాయక్ సెట్స్ లో భవదీయుడు ఎంట్రీ.. పిక్స్ వైరల్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసెంట్ ఫాస్ట్ గా సినిమాలు పూర్తి చేస్తున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ ఒకటి.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందుతుంది.పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

భీమ్లా నాయక్ సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా పాన్ ఇండియా సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ కోసం రేస్ నుండి తప్పుకుంది.ఆ తర్వాత భీమ్లా నాయక్ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు.

కానీ కరోనా వల్ల మళ్ళీ పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమాకు రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించారు.అన్ని అనుకూలిస్తేనే ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని తెలిపారు.

Advertisement

లేకపోతే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు లేనంత విధంగా సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు.

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.ఆ తర్వాత కూడా వరుస సినిమాలను అనౌన్స్ చేసాడు పవన్.

అందులో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా ఉంది.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

హరీష్ శంకర్ ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేసాడు.ఇది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఇక ఇది ఇలా ఉండగా ప్రసెంట్ భీమ్లా నాయక్ పెండింగ్ లో ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.అలాగే ఇంట్రెడక్షన్ సాంగ్ షూట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది.

Advertisement

ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ బ్యాలెన్స్ షూట్ లో బిజీగా ఉన్నారు.

రెండు రోజులు మాత్రమే ఈ షూట్ జరగనుంది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సెట్స్ లోకి హరీష్ శంకర్ మరియు నిర్మాత రవి ఎంట్రీ ఇచ్చి పవన్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.పవన్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హరీష్ షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

త్వరలోన్ ఈ యాక్షన్ స్టార్ట్ చేస్తామని హరీష్ శంకర్ తెలిపారు.దీంతో భవదీయుడు షూట్ త్వరలోనే స్టార్ట్ అవ్వనుందని తెలుస్తుంది.

తాజా వార్తలు