భరత్‌ మళ్లీ రావాలనుకుంటున్నాడు.. మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘శ్రీమంతుడు’.

ఆ చిత్రంలో పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా చేయాలి, డబ్బు సంపాదించిన వారు సొంత ఊరును అభివృద్ది చేస్తే దేశంలోని అన్ని గ్రామాలు కూడా అభివృద్ది చెందుతాయి అంటూ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివలు ఆ చిత్రంలో చూపించారు.

ఇక తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం ‘భరత్‌ అనే నేను’ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో రాజకీయ నాయకుడు ఆడిన మాట తప్పకూడదు అని, మాట తప్పిన వాడు మనిషి కాడు అంటూ చెప్పుకొచ్చాడు.

భరత్‌ అనే నేను చిత్రం టాప్‌ చిత్రాల జాబితాలో నిలిచింది.

వేసవి కానుకగా విడుదలైన ‘భరత్‌ అనే నేను’ ఏకంగా 100 కోట్ల షేర్‌కు పైగా దక్కించుకుంది.మహేష్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచిన భరత్‌ అనే నేను చిత్రం గురించి ఈమద్య భారత పార్లమెంటులో కూడా చర్చ జరిగిన విషయం తెల్సిందే.రాజకీయ నాయకుడు అనేవాడు మాట తప్పకూడదు అని, మాట తప్పితే మరణించినట్లే అంటూ భరత్‌ అనే నేను చిత్రంలో చూపించారు అంటూ ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంటులో చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

భరత్‌ అనే నేను చిత్రంపై పార్లమెంటులో చర్చ జరగడం పట్ల చిత్ర యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఆ విషయమై మహేష్‌బాబు భార్య నమ్రత స్పందిస్తూ.సినిమా గురించి పార్లమెంటులో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించింది.సమాజంపై సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో మరోసారి నిరూపితం అయ్యింది.

ఈ చిత్రం కూడా సమాజంపై మంచి ప్రభావంను చూపిస్తుందనే నమ్మకం వ్యక్తం అయ్యిందని చెప్పుకొచ్చింది.ఇంతటి ఆధరణ దక్కించుకున్న సినిమాకు సీక్వెల్‌ చేయాలని అనుకుంటున్నట్లుగా ఒక జాతీయ స్థాయి మీడియాతో నమ్రత అన్నట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ సినీ విశ్లేషకుడు తన బ్లాక్‌లో భరత్‌ అనే నేను చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది అన్నట్లుగా పోస్ట్‌ చేశాడు.భరత్‌ అనే నేను చిత్రం కథ సీక్వెల్‌కు స్కోప్‌ ఉంది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

సీఎంగా హీరో ఇంకా ఏం చేశాడు, స్వార్థ రాజకీయ నేతలు అతడిని ఎలా దించేయాలని ప్రయత్నించారు, ఆ తర్వాత భరత్‌ జాతీయ స్థాయిలో ఎలా గుర్తింపు తెచ్చుకుంటాడు అనేది రెండవ పార్ట్‌లో చూపించే అవకాశం ఉంది.అందుకే కొరటాల శివ ప్రస్తుతం భరత్‌ అనే నేను చిత్రానికి సీక్వెల్‌ కథను సిద్దం చేయిస్తున్నాడు.

Advertisement

కొరటాల శివ అసిస్టెంట్స్‌ ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ సీక్వెల్‌కు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది.

మొదటి భరత్‌ స్థాయిలో రెండవ భరత్‌ ఆకట్టుకుని మ్యాజిక్‌ను రిపీట్‌ చేయగలడా అనేది చూడాలి.