సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి?

సాధారణంగా ఎంతో మంది దంపతులు వివాహం జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం ఉండదు.

అలాంటి వారు ఎన్నో డబ్బులు ఖర్చు చేసే ఆస్పత్రులలో చికిత్స తీసుకున్నా ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు.

అలాగే సంతానం కలుగుతుంది అంటే ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు.సంతానం కోసం చాలామంది దంపతులు చేయని పూజ ఉండదు ఎక్కని ఆసుపత్రి మెట్లు ఉండవని చెప్పవచ్చు.

ఈ విధంగా సంతానం లేక ఇబ్బందులు పడే వారు మంగళవారం ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో పూజ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.మంగళవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలంటు స్నానం చేసి ఎర్రని దుస్తులు ధరించి ఆంజనేయ స్వామిని పూజించాలి.

ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఐదు లేదా ఏడు వారాలు ఆంజనేయ స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.మంగళవారం స్వామివారికి పూజ చేసేవారు ఎరుపు దుస్తులను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో, సింధూరంతో స్వామికి పూజలు చేసి కేసరి నైవేద్యంగా సమర్పించాలి.

Advertisement
Bhakti If You Want To Have Children You Have To Worship Like This On Tuesday Han

ఇలా చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది.

Bhakti If You Want To Have Children You Have To Worship Like This On Tuesday Han

ఇలా ప్రతి మంగళవారం సంతానంలేని దంపతులు ఈ ఈ విధంగా పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలగడమేకాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, స్వామివారికి పూజ చేసే సమయంలో తమలపాకుతో అభిషేకం చేయటం వల్ల సుఖశాంతులు కలుగుతాయి.పూజ అనంతరం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కారమవుతాయి.అయితే మంగళవారం స్వామివారికి పూజ చేసే వారు ఉపవాసంతో పూజ చేసి రాత్రికి ఉప్పులేని అన్నం తినడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు