కొన్నిసార్లు సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా ప్రేక్షకులు హిట్ చేసిన దాని తాలూకా ప్రభావం సదరు హీరో పై పడుతుంది.
ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు సినిమా( Alluri Sitaramaraju movie ) తీసుకోండి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా తర్వాత దాదాపు 8 సినిమాల వరకు కృష్ణ పై ఆ ప్రభావం ఉందట ఎందుకంటే ప్రతి సినిమాను అల్లూరి సినిమాతో పోల్చి చూస్తూ ఆ స్థాయిలో లేకపోయేసరికి వాటిని ఆదరించలేకపోయారు ప్రేక్షకులు.
అంతేకాదు మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పై కూడా ఇలాంటి ప్రభావం ఇవ్వబడింది.అయితే గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి.
అలాంటి మరొక ఉదాహరణ చిరంజీవి చంటబ్బాయి చిత్రం.
1986లో చిరంజీవి సుహాసిని జంటగా కామెడీ బ్రహ్మ దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన చిత్రం చంటబ్బాయి( Chantabai ).ఈ సినిమా కథ విన్నప్పుడు చిరంజీవి కథ చాలా బాగుంది ఈ సినిమాను నేనే తీస్తాను అని జంధ్యాల( Jandhyala ) గారికి మాట ఇచ్చారట అయితే కథలో పూర్తిస్థాయి కామెడీతో నింపుతారని ముందు చిరంజీవి కూడా ఊహించలేదు.జంధ్యాల అంటేనే కామెడీ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
అయితే పూర్తిస్థాయి కామెడీతో చిరంజీవి( Chiranjeevi ) అభినయంతోనే హావభావాలతోనే ఈ చిత్రం విజయాన్ని అందుకుంది.అప్పట్లో ఈ చిత్రం ఒక ప్రయోగాత్మకంగా విజయాన్ని సాధించింది.
హిట్టయితే కొట్టింది కానీ ఈ సినిమా ప్రభావం చిరంజీవి బాగా పడింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మాట్లాడుతూ చంటబ్బాయి చిత్రం విజయం సాధించిన అది చిరంజీవికి మాత్రం కష్టాలను తెచ్చి పెట్టిందని ఈ సినిమా తర్వాత అందరూ కామెడీ లేదా సెంటిమెంటు తరహా సినిమాలనే చేయాలని ఆయనను అప్రోచ్ అయ్యే వారని అలా సినిమా తీయడం ఇష్టం లేని చిరంజీవి దాదాపు 6 నెలల వరకు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కానీ చంటబ్బాయి సినిమా చేసినందుకు చిరంజీవి ఎప్పుడూ బాధపడలేదు అని అదొక ప్రయోగాత్మక చిత్రంగానే భావించారని తెలిపారు.చిరంజీవి కమర్షియల్ సినిమాల్లో హీరోగా ఉండాలని ఆ తర్వాత కామెడీ తరహా ఎక్స్పరిమెంట్స్ చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారని అల్లు అరవింద్ తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy