పెనుముప్పుగా మారిన పీడీఎఫ్ ఫైల్స్‌.. ఓపెన్ చేశారో కొంప కొల్లేరే!

ఒక లేటెస్ట్ టెక్ రిపోర్ట్ ప్రకారం, 66% పైగా, సైబర్ నేరస్థులు PDF ఫైల్‌లను( PDF Files ) ఉపయోగించి ఈ-మెయిల్ ద్వారా హానికరమైన మాల్వేర్స్( Malware ) పంపుతున్నారు.

ఈ హానికరమైన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ మీ కంప్యూటర్ లేదా ఫోన్‌లో చొరబడి సెన్సిటివ్ డేటాను( Sensitive Data ) తస్కరిస్తాయి.

పీడీఎఫ్ ఫైల్స్‌లోని అటాచ్‌మెంట్స్‌లో ఈ మాల్వేర్స్‌ను హ్యాకర్లు ఉంచుతున్నారు.ఈ విషయం తెలియని యూజర్లు ఆ అటాచ్‌మెంట్స్‌పై క్లిక్ చేసి బాధితులుగా మారుతున్నారు.

మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, పీడీఎఫ్ ఫైల్‌లను తెరవడానికి ముందు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో వాటిని స్కాన్ చేయడం ముఖ్యం.పాపులర్ వెబ్‌సైట్‌లు లేదా అఫీషియల్ సోర్సెస్ వంటి ట్రస్టెడ్ వెబ్‌సైట్‌ల నుంచి మాత్రమే పీడీఎఫ్ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.పీడీఎఫ్‌లలో లింక్‌లు, పాప్-అప్ ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలి.

అవి అనుమానాస్పదంగా అనిపిస్తే వాటిపై క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి.ఆన్‌లైన్‌లో తెలియని ఫైల్‌లు లేదా వెబ్‌సైట్‌లు యాక్సెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisement

లేదంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

ఇకపోతే చాట్‌జీపీటీ అని పిలిచే AI చాట్‌బాట్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ల సంఖ్యలో కూడా పెద్ద పెరుగుదల (910%) ఉన్నట్లు నివేదిక కనుగొంది.ఈ వెబ్‌సైట్‌లను కొన్ని స్కామ్‌ల కోసం ఉపయోగించడం జరిగింది.అంతేకాకుండా చాట్‌జీపీటీ వలె నటిస్తున్న వెబ్‌సైట్‌లలో భారీ వృద్ధి (17,818%) నమోదైనట్లు రిపోర్ట్ వెల్లడించింది.

అడల్ట్ వెబ్‌సైట్లు, కొత్త డొమైన్‌లతో ఆర్థిక సేవల వెబ్‌సైట్‌లను విజిట్ చేసే ఇంటర్నెట్ యూజర్లను హ్యాకర్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటారు.మునుపటి సంవత్సరంతో పోలిస్తే, మాల్వేర్స్‌ను దాడి చేయడానికి ఉపయోగించడం 55% పెరిగింది.

తయారీ, యుటిలిటీస్, ఎనర్జీ వంటి పరిశ్రమలలో, ఒక్కో కస్టమర్‌పై దాడుల సంఖ్య 238% పెరిగింది.

న్యూస్ రౌండర్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు