డెంగ్యూ దోమలతో జాగ్రత్త..! వాటి దాడిని ఈ విధంగా అడ్డుకోండి..?

వర్షాకాలం మొదలైంది అంటే చాలు దోమల బెడద అసలు తప్పదు.దోమల వలన వచ్చే వ్యాధులకు సంబంధించిన కేసులు ప్రతిరోజు నమోదు అవుతున్నాయి.

డెంగ్యూ దోమలు ( Dengue mosquitoes )సాయంత్రం పూట కూడా కుడతాయి.కొన్ని జాతుల దోమలు ఉదయం సాయంత్రం కూడా దాడి చేస్తూ ఉంటాయి.

ఇదే రోగాలకు కారణమవుతూ ఉంటుంది.ముఖ్యంగా ఏడేస్ దోమల( Aedes mosquito ) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ దోమలు ఎప్పుడైనా కూడా కుట్టవచ్చు.ముఖ్యంగా ఉదయం 6 నుండి 10 గంటల సమయంలో, సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్య కూడుతూ ఉంటాయి.

Advertisement
Beware Of Dengue Mosquitoes..! Prevent Their Attack Like This, Dengue Mosquitoes

ఇది చాలా అరుదుగా రాత్రిపూట కుట్టే ప్రమాదం ఉంది.ఈ దోమలు మంచినీటిలో కూడా సంతానోత్పత్తి చేస్తాయి.

Beware Of Dengue Mosquitoes.. Prevent Their Attack Like This, Dengue Mosquitoes

ఈ జాతి దోమలు పెద్దగా సౌండ్ చేయకుండా నిశ్శబ్దంగా కొరుకుతాయి.ఈ దోమల నుండి రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం ఇంట్లో ఉండాలి.అలాగే పరిసరాలలో నీటి నిలువ లేకుండా వాటి సంతానోత్పత్తిని నివారించాలి.

నీరు నిలిచి ఉండే ప్రాంతాలకు వెళ్లడం కూడా మానుకోవాలి.నిలిచిపోయిన నీరు దోమలకు ఆవాసాలుగా మారుతాయి.

ఇక పిల్లలు, వృద్దుల కోసం దోమతెరలను( Mosquito nets ) ఉపయోగించడం చాలా ముఖ్యం.అయితే ఇప్పుడు డెంగ్యూ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

డెంగ్యూ జ్వరం,( Dengue fever ) తీవ్రమైన రక్తస్రావ జ్వరం.ఇవి ఎక్కువగా మెదడు లేదా హృదయం నుండి రక్తస్రావానికి కారణం అవుతాయి.

Advertisement

అత్యంత ప్రమాదకరమైన డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కారణంగా లో బీపీ కూడా వస్తుంది.అంతేకాకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది.

అయితే ఆ సమయంలో ద్రవాల అవసరం ఉంటుంది.ఈ డెంగ్యూ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.దీని ప్రధాన లక్షణాలు అధిక జ్వరం, శరీర భాగాల్లో తీవ్రమైన నొప్పులు, కీళ్ల నొప్పులు ( Joint pains )వస్తాయి.

ఇక మనిషి బలహీనంగా మారిపోతాడు.మూడు నుండి నాలుగు రోజులపాటు జ్వరం ఉంటుంది.

ఇక జ్వరం లేని సమయంలో ప్లేట్లెట్స్ పడిపోవడం లాంటి సమస్యలు సంభవిస్తాయి.దీన్ని ప్రమాదకరమైన కాలంగా పరిగణిస్తారు.

ఇక లో బీపీ ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ లో తీవ్రమైన తగ్గుదల ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది.

తాజా వార్తలు