తాగి తాగి హ్యాంగోవర్ అయ్యారా? అయితే మీకోస‌మే ఈ టిప్స్‌!

న్యూ ఇయ‌ర్ వ‌స్తోందంటే చాలు పార్టీలు చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.ఇక పార్టీ చిన్న‌దైన, పెద్ద‌దైన మందు లేకుండా జ‌ర‌గ‌డం ఇటీవ‌ల రోజుల్లో అసాధ్యం.

అయితే మ‌ద్యాన్ని లిమిట్‌గా తీసుకుంటే ఎటువంటి స‌మ‌స్యా ఉండ‌దు.కానీ, లిమిట్ క్రాస్ చేసి తీసుకుంటే మాత్రం మొద‌ట ఇబ్బంది పెట్టేది హ్యాంగోవ‌ర్ స‌మ‌స్యే.

హ్యాంగోవ‌ర్‌కి గురైతే ఆ రోజు మొత్తం ఎంతో చిరాగ్గా, అల‌స‌ట‌గా ఉంటుంది.అలాగే తీవ్ర‌మైన త‌ల నొప్పి, మైకం, దాహం, వికారం వంటివి కూడా హ్యాంగోవ‌ర్ ల‌క్ష‌ణాలు.

మ‌రి మీరూ తాగి తాగి హ్యాంగోవ‌ర్ అయ్యారా.? అయితే దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఖ‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం హ్యాంగోవ‌ర్‌ను నివారించే టిప్స్ ఏంటో చూసేయండి.

Advertisement
Best Ways To Get Rid Of Hangover! Hangover, Latest News, Health Tips, Good Healt

ట‌మాటో జ్యూస్.హ్యాంగోవ‌ర్‌ను దూరం చేయ‌డంలో సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక‌టి లేదా రెండు ట‌మాటోల‌ను తీసుకుని చ‌క్క‌గా జ్యూస్ చేసుకుని తాగితే హ్యాంగోవ‌ర్ నుంచి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డొచ్చు.అవ‌కాడో పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అలాగే హ్యాంగోవ‌ర్‌నూ నివారిస్తుంది.అవ‌కాడో పండుతో స్మూతీని త‌యారు చేసుకుని తీసుకుంటే గ‌నుక హ్యాంగోవ‌ర్ ల‌క్ష‌ణాలు ఇట్టే ప‌రార్ అవుతాయి.

Best Ways To Get Rid Of Hangover Hangover, Latest News, Health Tips, Good Healt

హ్యాంగోవ‌ర్ నుంచి విముక్తి పొంద‌డానికి నిద్ర ఓ గొప్ప మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.అవును, ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అంత త్వరగా హ్యాంగోవర్ నుండి బయటపడుతారు.ఆపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా హ్యాంగోవ‌ర్ నుంచి బ‌య‌ట ప‌డొచ్చు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక స్పూన్ పిల్ సైడర్ వెనిగర్, రెండు స్పూన్ల నిమ్మ ర‌సం యాడ్ చేసుకుని తాగితే హ్యాంగోర్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.ఇక కొబ్బ‌రి నీళ్లు, అల్లం టీ, సిట్ర‌స్ ఫ్రూట్ జ్యూసులు, మ‌జ్జిగ వంటివి కూడా హ్యాంగోవర్ నివారిణిలుగా ప‌ని చేస్తాయి.

Advertisement

కాబ‌ట్టి, వీటిని కూడా తీసుకోవ‌చ్చు.

" autoplay>

తాజా వార్తలు