టమోటా ఆరోగ్యాన్నే కాదు జుట్టును పెంచుతుంది.. ఇంతకీ ఎలా వాడాలంటే?

మనం నిత్యం వంటల్లో విరివిరిగా వాడే కూరగాయల్లో టమోటా( Tomato ) ముందు వరుసలో ఉంటుంది.

వంటలకు చక్కటి రుచిని అందించడంలో టమోటా ను కొట్టింది లేదు.

పైగా టమోటాలో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే ఆరోగ్యాన్ని మాత్రమే కాదు జుట్టును పెంచడానికి కూడా టమోటా అద్భుతంగా సహాయపడుతుంది.

సాధారణంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా మంది టమోటాల‌ను వాడుతుంటారు.అలాగే జుట్టుకు కూడా టమోటాలు ఉపయోగించవచ్చు.

టమోటాలో మెండుగా ఉండే విటమిన్ ఎ విటమిన్ సి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.స్కాల్ప్ ను తేమగా హెల్తీ గా మారుస్తాయి.

Advertisement

కురులను దృఢపరుస్తాయి.మరి ఇంతకీ జుట్టుకు టమోటాను ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకుందాం పదండి.

ముందుగా బాగా పండిన ఒక టమోటా తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ టమోటా ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం ( Castor Oil )వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

అరగంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత తీవ్రంగా రాలుతున్న క్రమంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

కురులు ఒత్తుగా మారతాయి.అలాగే చుండ్రు సమస్య( Dandruff problem ) ఉంటే దూరం అవుతుంది.

Advertisement

స్కాల్ప్ హెల్తీగా హైడ్రేటెడ్ గా మారుతుంది.కాబ‌ట్టి, ఆరోగ్యమైన ఒత్తైన కురుల కోసం తప్పకుండా ఈ టమోటా హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి.

తాజా వార్తలు