తిన్న కాసేపటికే మళ్ళీ ఆకలి వేస్తుందా.. అయితే కచ్చితంగా ఇది తెలుసుకోండి!

సాధారణంగా కొందరికి తిన్న కాసేపటికి మళ్ళీ ఆకలి వేస్తుంటుంది.దీన్నే అతి ఆకలి అంటారు.

ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా ఎప్పుడు చూడు మనసు ఫుడ్ వైపే లాగుతుంటుంది.ఎంత తిన్నా సరే మళ్లీ కొద్దిసేపటికి ఆకలి ప్రారంభమవుతుంది.

దీంతో నోట్లో ఏదో ఒకటి వేసుకుని నములుతూనే ఉంటారు.ఇలానే కొనసాగితే బరువు పెరగడంతో పాటు అనేక జబ్బులు చుట్టుముడతాయి.

కాబట్టి మొదట అతి ఆకలి సమస్యకు( Overeating problem ) చెక్ పెట్టాలి.

Advertisement

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.రోజు ఉదయం ఈ స్మూతీని తీసుకుంటే అతి ఆకలి అన్నమాటే అనరు.మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి.? ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పు పైనాపిల్ ముక్కలు( pineapple ) కట్ చేసి పెట్టుకోవాలి.

అలాగే ఒక అరటి పండు తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, అరటిపండు( Banana ) స్లైసెస్, రెండు నుంచి మూడు ఫ్రెష్ పాలకూర ఆకులు వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్ ఫ్రెష్ హోమ్ మేడ్ బాదం పాలు, ( Almond milk )రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్ ( Peanut butter )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా పైనాపిల్ బనానా స్పినాచ్ స్మూతీ సిద్దం అవుతుంది.ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ పరంగా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తుంది.

ముఖ్యంగా అతి ఆకలికి చెక్ పెడుతుంది.రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

దాంతో తరచూ ఆకలి వేయదు.చిరు తిండ్ల పై మనసు మళ్ల‌కుండా ఉంటుంది.

Advertisement

పైగా ఈ స్మూతీ ని రెగ్యులర్ గా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.మధుమేహం వచ్చే రిస్క్ త‌గ్గుతుంది.

రోజంతా ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఉంటారు.మరియు చర్మం కాంతివంతంగా యవ్వనంగా సైతం మెరుస్తుంది.

తాజా వార్తలు