ఈ రెమెడీ ముందు ఫేషియల్ కూడా పనికిరాదు.. వారంలో 2 సార్లు ట్రై చేస్తే ముఖం గ్లోయింగ్ గా మెరుస్తుంది!

ముఖ చర్మాన్ని గ్లోయింగ్( Glowing ) గా మెరిపించుకునేందుకు చాలా మంది మగువలు తెగ ఆరాటపడుతుంటారు.

ఈ క్రమంలోనే నెలకు కనీసం రెండు సార్లు అయినా బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.

అయితే ఇలా తరచూ ఫేషియల్ చేయించుకోవడం వల్ల స్కిన్ ప్రకాశవంతంగా మెరుస్తుంది.కానీ చర్మ ఆరోగ్యం పాడవుతుంది.

అందుకే సహజంగానే అందంగా మెరిసేందుకు ప్రయత్నించాలి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

ఈ రెమెడీ ముందు ఫేషియల్ కూడా పనికిరాదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో చూసేయండి.

Advertisement

ముందుగా ఒక బంగాళదుంపను( Potato ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn flour ), వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్( Beet root powder ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్, చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్( Wild Turmeric Powder ) వేసుకుని కలుపుకోవాలి.

ఇప్పుడు ఇందులో రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్( Rose essential oil ) తో పాటు సరిపడా బంగాళదుంప జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ లా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని వేళ్ళతో సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి కేవలం రెండు సార్లు ఈ రెమెడీని కనుక ట్రై చేస్తే ఫేషియల్ గ్లో మీ సొంతం అవుతుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు

చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.కాబట్టి ఇకపై గ్లోయింగ్ స్కిన్ కోసం వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్స్ చేయించుకోవడం మానేసి.

Advertisement

ఇప్పుడు చెప్పిన రెమెడీని పాటించండి.అందంగా మెరిసిపోండి.

తాజా వార్తలు