వేసవిలో బాడీ హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్ లో ఉండాల్సిందే!

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే అధిక ఎండలు కారణంగా ఈ సీజన్ లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు డీహైడ్రేషన్ కు గురవుతుంటారు.

దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.ఒక్కోసారి డీహైడ్రేషన్ వల్ల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంటుంది.

అందుకే వేసవిలో ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.

ఈ ఫుడ్స్ డైట్ లో ఉంటే మీ బాడీ సూపర్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Best Foods For Hydrating The Body In Summer Body Hydrating Foods, Dehydration,
Advertisement
Best Foods For Hydrating The Body In Summer! Body Hydrating Foods, Dehydration,

కీర దోసకాయ( Cucumber ).వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన కూరగాయ.కీర దోసకాయ( Cucumber )లో దాదాపు 96 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది.

వేసవికాలంలో రెగ్యులర్ గా కీరా దోసకాయ తీసుకుంటే డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు.అలాగే పుచ్చకాయలో కూడా వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.వేసవిలో పుచ్చకాయ ని తీసుకుంటే బాడీ హైడ్రేటెడ్ ఉంటుంది.

అలాగే శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.

Best Foods For Hydrating The Body In Summer Body Hydrating Foods, Dehydration,

వేసవికాలంలో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు సహాయపడే ఆహారాల్లో టమాటో ఒకటి.అందుకే ఈ సీజన్లో టమాటో( Tomato )లు ఎక్కువగా వాడాలి.రోజుకు ఒక పచ్చి టమాటో ను తీసుకుంటే ఇంకా మంచిది.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

పైనాపిల్ లోనూ 90 శాతానికి పైగా వాటర్ కంటెంట్ ఉంటుంది.వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో పైనాపిల్ ఒకటి.

Advertisement

పైనాపిల్ ను నేరుగా తీసుకోలేని వారు జ్యూస్, స్మూతీలు రూపంలో కూడా తీసుకోవచ్చు.తద్వారా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.

ప్రస్తుత వేసవికాలంలో డీహైడ్రేషన్ కు దూరంగా ఉండాలని భావించేవారు డైట్ లో కర్బూజ పండు( Muskmelon )ను కూడా చేర్చుకోండి.ఇది శరీరానికి అవసరమయ్యే నీటి శాతాన్ని అందించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

అలాగే వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది, ఇక వేసవిలో గ్రేప్స్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, కొబ్బరినీళ్లు, బొప్పాయి, పాలకూర, పెరుగు వంటి ఫుడ్స్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

ఇవి బాడీ ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

తాజా వార్తలు