సంతాన సమస్యలకు చెక్ పెట్టే బెస్ట్ ఫుడ్ ఇదే!

నేటి కాలంలో చాలా మంది సంతాన స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు.తల్లిదండ్రులు కావాల‌ని ప్ర‌తి దంప‌తులు కోరుకుంటాకు.

అయితే కొంద‌రికి మాత్రం సంతాన భాగ్యం లేక తీవ్రంగా చింతిస్తుంటారు.ఇటీవ‌ల కాలంలో చాలా మంది జంట‌లు పిల్లల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమవుతున్నారు.

చెప్పులు అరిగేలా హాస్ప‌ట‌ల్ చుట్టూ తిరిగినా.ర‌క‌ర‌కాల మందులు వాడినా ఫ‌లితం లేక హైరానా ప‌డుతుంటారు.

అయితే మందులు కాకుండా.తినే ఆహారంలో మార్పులు చేసుకుంటే సంతాన భాగ్యం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Best Food For Reducing Fertility Problems! Best Food, Reducing Fertility Problem

మ‌రి అవేంటో చూసేయండి.దంప‌తులిద్ద‌రు పాలు, పాల పదార్థాలు అంటే పెరుగు, నెయ్యి, వెన్న, మ‌జ్జిగ‌ ఇలాంటివి ప్ర‌తి రోజు తీసుకోవాలి.

ఎందుకంటే.ఇందులో ఉండే విటమిన్లు స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తిని పెంచి సంతాన స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

సంతానం కోసం ప్రయత్నించేవారు విటమిన్‌ సి, ఇ, జింక్‌, ఫోలిక్‌ యాసిడ్ ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే.

మహిళల్లో ప్రత్యుత్పత్తిని వేగవంతం చేయడంలో ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

Best Food For Reducing Fertility Problems Best Food, Reducing Fertility Problem
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అలాగే ఆలుమగలిద్దరూ ప్ర‌తి రోజు ఖ‌చ్చితంగా తీసుకోవాలి.ఎందుకంటే.గుడ్డులో ఉండే విటమిన్ డి ఆడ‌వారిలో ఫెర్టిలిటికి సహాయప‌డ‌గా.

Advertisement

జింక్ పురుషుల్లో హార్మోన్సు పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.వాల్ నట్స్, బాదం, జీడి ప‌ప్పు వంటి న‌ట్స్‌ను డైలీ తీసుకోవాలి.

వీటిలో ఉండే విటమిన్ మహిళల్లో ప్రత్యుత్పత్తికి అవ‌స‌ర‌మ‌వ‌డంతో పాటు గ‌ర్భస్రావం జరగకుండా కాపాడ‌తాయి.అదేవిధంగా, ఆకుకూరలు అంటే ముఖ్యంగా పాల‌కూర‌, తోట‌కూర‌, మెంతికూర‌, బ్రోక‌లి ఎక్కువ‌గా తీసుకోవాలి.

ఇవి త్వ‌ర‌గా గర్భం దాల్చేందుకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే సంతాన స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో చేయ‌డంతో ఖ‌ర్జూరాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, ఖర్జూరాలు రోజుకు రెండు లేదా మూడు అయినా తీసుకోవాల‌ని అంటున్నారు.వీటితో పాటు తాజా పండ్లు తప్ప‌కుండా తీసుకోవాలి.

అయితే సంతానం కోసం ప్ర‌య‌త్నించే వారు ధూమాపానం, మ‌ధ్య‌పానంకు దూరం ఉండాలి.

తాజా వార్తలు