ఈ న్యాచుర‌ల్ స్క్ర‌బ్ మృత క‌ణాల‌ను తొల‌గించి స్కిన్ ను వైట్‌గా మారుస్తుంది!

మృత క‌ణాలు(డెడ్ స్కిన్ సెల్స్‌).పేరుకుపోయే కొద్ది చ‌ర్మం యొక్క నిగారింపు త‌గ్గిపోతుంది.

అలాగే స్కిన్ డార్క్‌గా, నిర్జీవంగా కూడా మారిపోతుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క‌.

చ‌ర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో అర్థంగాక తెగ హైరానా ప‌డిపోతుంటారు.ఈ క్ర‌మంలోనే ఇరుగు పొరుగు వారి చెప్పిన చిట్కాల‌న్నీ ఫాలో అవుతుంటారు.

అలాగే మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ స్క్ర‌బ్ ను ట్రై చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోవ‌డ‌మే కాదు చ‌ర్మం వైట్‌గా, బ్రైట్‌గా కూడా మారుతుంది.

Advertisement

మ‌రి ఇంకెందు ఆల‌స్యం ఆ స్క్ర‌బ్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని మూడు లేదా నాలుగు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు ఎండిన గులాబీ రేక‌లు, మూడు బాదం ప‌ప్పులు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే స్క్ర‌బ్బింగ్ ప్యాక్ సిద్ధ‌మైన‌ట్లే.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకుని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేళ్ల‌తో సున్నితంగా స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆపై ప‌ది నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజుల‌కు ఒక‌సారి ఈ విధంగా చ‌ర్మాన్ని స్క్ర‌బ్ చేసుకుంటే.డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోతాయి.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

అదే స‌మ‌యంలో చ‌ర్మం వైట్‌గా, బ్రైట్‌గా కూడా త‌యార‌వుతుంది.

Advertisement