నెలకు 3 సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే తెల్ల జుట్టు రమ్మన్నా రాదు!

తెల్ల జుట్టు ( white hair )వృద్ధాప్యానికి సంకేతం.అందుకే తెల్ల జుట్టు వచ్చిందంటే చాలు తెగ హైరానా పడిపోతుంటారు.

పైగా ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.తెల్ల జుట్టుతో బయటకు వెళితే ఎక్కడ హేళన చేస్తారో అని చెప్పి ఆర్టిఫిషియల్ రంగుల పై ఆధార పడుతున్నారు.

అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ హెయిర్ ప్యాక్ ను నెలకు మూడు సార్లు వేసుకుంటే చాలు తెల్ల జుట్టు రమ్మన్నా రాదు.

వయసు పైబడిన సరే మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్( Hair pack )ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Best And Natural Pack For Avoiding White Hair White Hair, Black Hair, Hair Car
Advertisement
Best And Natural Pack For Avoiding White Hair! White Hair, Black Hair, Hair Car

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ శీకాకాయ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బ్రహ్మి పొడి,( Brahmi Powder ) వన్ టేబుల్ స్పూన్ భృంగరాజ్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ హైబిస్కస్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ త్రిఫల పౌడర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు టీ డికాక్షన్ వేసి స్మూత్ స్ట్రక్చర్ లో కలుపుకుని మూత పెట్టి గంట పాటు వదిలేయాలి.

Best And Natural Pack For Avoiding White Hair White Hair, Black Hair, Hair Car

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల( Hair follicles ) నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను యూజ్‌ చేసి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.నెలకు కేవలం మూడు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను కనుక వేసుకుంటే తెల్ల జుట్టు అన్న మాటే అనరు.

ఈ హెయిర్ ప్యాక్ లో ఉపయోగించిన పదార్థాలు జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని అద్భుతంగా మెరుగుపరుస్తాయి.జుట్టు తెల్లబడకుండా అడ్డుకుంటాయి.ఒక‌వేళ తెల్ల జుట్టు ఉన్నా.

క్ర‌మంగా న‌ల్ల‌బ‌డుతుంది.కాబట్టి ఎవరైతే తెల్ల జుట్టు సమస్యకు దూరంగా ఉండాలని భావిస్తున్నారో తప్పకుండా వారు ఈ హెయిర్ ప్యాక్ ను ప్రయత్నించండి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

మంచి రిజ‌ల్ట్ మీసొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు