నిత్యం ఈ సింపుల్ ఐ మాస్క్ వేసుకుంటే డార్క్ సర్కిల్స్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!

మనలో చాలామంది అత్యంత సర్వసాధారణంగా ఫేస్ చేసే చర్మ సమస్యల్లో డార్క్ సర్కిల్స్ ఒకటి.

రాత్రుళ్ళు ఎక్కువ సమయం పాటు మేల్కొని ఉండటం, గంటలు తరబడి ఫోన్ లో మునిగిపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, డిప్రెషన్, పలు రకాల మందుల వాడకం, పలు అనారోగ్య సమస్యలు తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్( Dark circles ) ఏర్పడుతుంటాయి.

ఇది చాలా అస‌హ్యంగా కనిపిస్తాయి.ముఖంలో మెరుపును దూరం చేస్తాయి.

అందాన్ని దెబ్బతీస్తాయి.ఈ క్రమంలోనే డార్క్ సర్కిల్స్ ను వదిలించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఐ మాస్క్ మీకు చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.నిత్యం ఈ ఐ మాస్క్( Eye mask ) వేసుకుంటే డార్క్ సర్కిల్స్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

Advertisement

మరి ఇంతకీ ఆ ఐ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు కుంకుమ పువ్వు మరియు మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( raw milk ) వేసుకుని బాగా కలిపి గంట పాటు వదిలేయాలి.

ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ మరియు కుంకుమపువ్వు పాలు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన ఐ మాస్క్ అనేది రెడీ అవుతుంది.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో కళ్ళ చుట్టూ ఒకటికి రెండుసార్లు బాగా అప్లై చేసుకోవాలి.

20 నిమిషాల పాటు ఈ ఐ మాస్క్ ఉంచుకోవాలి.అనంతరం తడి వేళ్ళతో కళ్ళ చుట్టూ సున్నితంగా రెండు మూడు నిమిషాలు మసాజ్ చేసుకుని అప్పుడు తడి క్లాత్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ ఐ మాస్క్ వేసుకుంటే డార్క్ సర్కిల్స్ క్రమంగా మాయమవుతాయి.

కళ్ళ చుట్టూ ఏర్పడిన నలుపు మొత్తం క్రమంగా దూరం అవుతుంది.కళ్ళు అట్రాక్టివ్ గా మారతాయి.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు