హాకీ టీం సభ్యులందరికి గుండు కొట్టించిన కోచ్‌.. వారు చేసిన తప్పేంటో తెలుసా?

ఆట ఏదైనా, ఆ జట్టు సభ్యులందరిని కూడా క్రమశిక్షణలో కోచ్‌ ఉంచాలి.జట్టు సభ్యులు క్రమశిక్షణతో మెలిగినప్పుడే సగం ఆటను గెలుస్తారు.

అత్యుత్తమ ఆటగాడు ఎప్పుడు కూడా తన కోచ్‌ మాటను జవ దాటడు.ముఖ్యంగా మన ఇండియాలో గురువులను దైవ సమానులుగా చూస్తాం.

గురువు చెప్పినట్లుగా ఫాలో అయ్యి ఎంతోమంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు, ఇంటర్నేషనల్‌ వేదికలపై సత్తా చాటిన విషయం తెల్సిందే.అలాంటి గురువు తాజాగా ఒక జట్టుకు విధించిన శిక్ష దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.

ఆ గురువుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సమయంలోనే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించే వారు కూడా ఉన్నారు.

Advertisement

ఇంతకు ఆ గురువు ఎవరు, ఆ కథా కమీషు ఏంటో ఇప్పుడు చూద్దాం.పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర స్థాయి హాకీ జట్టు ఉంది.

బెంగాల్‌ హాకీ జట్టు తాజాగా మద్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ లో జనవరి 16న నమ్‌ ధారి జట్టుతో తలపడింది.ఆ మ్యాచ్‌లో బెంగాల్‌ జట్టు పేలవమైన ప్రదర్శణ చేసింది.

చెత్త ప్రదర్శణ చేసి అత్యంత దారుణమైన ఓటమిని చవి చూశారు.బెంగాల్‌ జట్టు చరిత్రలో అంతటి దారుణమైన ఓటమి లేదు.

అందుకే బెంగాల్‌ హాకీ జట్టు కోచ్‌కు తీవ్ర ఆగ్రహం వచ్చింది.రాష్ట్రం పరువు మరియు తన పరువు తీశారంటూ జట్టు సభ్యులందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

మీ చెత్త ప్రదర్శణకు పశ్చాతాపంగా జట్టు సభ్యులందరు కూడా గుండు కొట్టించుకోనే మళ్లీ ప్రాక్టీస్‌కు రావాల్సిందిగా ఆదేశించాడు.అలా జరిగితే అయినా మీలో కసి పెరుగుతుంది, గుండ్లతో నాకు కనిపించకుంటే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించాడు.దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో జట్టు సభ్యులంతా కూడా గుండ్లు కొట్టించుకున్నారు.

Advertisement

ఆ విషయం మూడు రోజుల తర్వాత సోషల్‌ మీడియా ద్వారా బయటకు వచ్చింది.జట్టు సభ్యుల్లో ఒకడు ఇంట్లో ఎవరైనా చనిపోతే గుండు కొట్టించుకుంటాం, కాని కోచ్‌ బలవంతం మేరకు గుండు చేయించుకున్నాను అంటూ చెప్పాడు.

దాంతో వివాదం మొదలైంది.

మరి కొందరు మాత్రం తమకు కోచ్‌ గుండు కొట్టించుకోవాలని సూచించలేదని, తామే కొట్టించుకున్నట్లుగా చెప్పారు.మొత్తానికి ఈ విషయమై బెంగాల్‌ హాకీ అసోషియేషన్‌ కమిటీ వేసి విచారణ చేపట్టింది.కోచ్‌ ఆనంద్‌ కుమార్‌ మాత్రం తానేం గుండ్లు కొట్టించుకోమని ఆదేశించలేదని, మ్యాచ్‌ ఓడిపోయిన సమయంలో కోపంలో తిట్టాను తప్ప ఇందులో తాను చేసింది ఏమీ లేదని చెబుతున్నాడు.

అయితే ఆనంద్‌ చేసిందాంట్లో తప్పేం లేదని కొందరు సపోర్ట్‌ చేస్తున్నారు.కోచ్‌కు ఫుల్‌ ఫ్రీడం ఇస్తేనే తన జట్టు సభ్యులను రాటు తేల్చుతాడని అంటున్నారు.కోచ్‌ ఆనంద్‌ను మీరు సపోర్ట్‌ చేస్తే ఈ విషయాన్ని షేర్‌ చేసి, ఐ సపోర్ట్‌ ఆనంద్‌ సర్‌ అంటూ కామెంట్‌ చేయండి.

తాజా వార్తలు