watermelon : పురుషులకు వరం పుచ్చకాయ.. రోజు తింటే ఆ సమస్య దూరం!

పుచ్చకాయ( watermelon ) పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు చాలా మంది ఇష్టంగా తినే పండ్ల‌లో ఒక‌టి.

స్వీట్ గా, జ్యూసీగా ఉండే ఈ స‌మ్మ‌ర్ ఫ్రూట్ లో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉన్నందున పుచ్చకాయ మ‌న‌ల్ని హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

అలాగే ఎన్నో ర‌కాల విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్( Vitamins, minerals, antioxidants ) తో పుచ్చ‌కాయ ప్యాక్ చేయ‌బ‌డి ఉంటుంది.అందువ‌ల్ల ఆరోగ్యానికి పుచ్చ‌కాయ అపార‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

ముఖ్యంగా పురుషుల‌కు పుచ్చ‌కాయ వ‌రమ‌ని నిపుణులు చెబుతున్నారు.ఇటీవ‌ల కాలంలో మ‌గ‌వారిని అత్య‌ధికంగా వేధిస్తున్న లైంగిక స‌మ‌స్య‌ల్లో అంగస్తంభన ముందు వ‌రుస‌లో ఉంది.

ఎంద‌రో పురుషులు అంగస్తంభన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.అంగస్తంభన వల్ల‌ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయ‌లేక‌పోతుంటారు.

Advertisement

ఈ క్ర‌మంలోనే మాన‌సికంగా తీవ్ర ఒత్తిడి లోన‌వుతుంటారు.అయితే అంగస్తంభన సమస్యకు చికిత్స చేయడానికి అనేక రకాల మూలికా మందులే కాకుండా సహజ ఔషధాలు కూడా ఉన్నాయి.

ఈ జాబితాలో పుచ్చ‌కాయ కూడా ఒక‌టి.

పుచ్చకాయలో ఎల్-సిట్రులైన్ ( L-citrulline )అధిక మొత్తంలో ఉంటుంది.ఇది ఒక రకమైన అమైనో ఆమ్లం.ఇది జననేంద్రియాలకు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.

అంగస్తంభన స‌మ‌స్య‌ను దూరంలో స‌హాయ‌ప‌డుతుంది.యూరాలజీలో జ‌రిపిన‌ ఒక అధ్యయన ప్రకారం.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

నెల రోజుల పాటు 24 మంది పురుషులకు ఎల్-సిట్రులైన్ సప్లిమెంట్ ఇచ్చారు.అనూహ్యంగా వారి అంగస్తంభనలో స్వల్ప మెరుగుదల క‌నిపించింది.

Advertisement

అలాగే మగ ఎలుకలపై పుచ్చకాయ పండును పరీక్షించినప్పుడు, వాటి లైంగిక కార్యకలాపాలు మెరుగుపడిన‌ట్లు కూడా గుర్తించారు.

అంతేకాకుండా పుచ్చకాయలో ఉండే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లలో ( antioxidants )లైకోపీన్ ఒక‌టి.ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది మ‌రియు పురుషుల సంతానోత్పత్తిని పెంచుతుంది.కాబ‌ట్టి లైంగిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న పురుషులు త‌మ రెగ్యుల‌ర్ డైట్ లో ఒక క‌ప్పు ముచ్చ‌కాయ ముక్క‌ల‌ను చేర్చుకోవ‌డం ఎంతో ఉత్త‌మం అని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే మంచిది క‌దా అని అతిగా తింటే మాత్రం లేనిపోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌.

తాజా వార్తలు