మీరు స్మార్ట్‌ఫోన్ కవర్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే ఈ వివరాలు తెలుసుకోండి!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లకు సంబంధించి బ్యాక్ కవర్, ఫ్లిప్ కవర్, హార్డ్-కేస్, బంపర్ కవర్, హోల్‌స్టర్ మొబైల్ కవర్ వంటి అనేక రకాల మొబైల్ కవర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

అయితే ఈ కవర్లన్నీ మొబైల్‌ను పూర్తిగా కవర్ చేస్తాయి.

ఈ కవర్లు మీ మొబైల్ అసలు రూపాన్ని దాచివేస్తాయి.ఇది కాకుండా, మనలో చాలా మంది మొబైల్ కవర్‌ను తీసివేసి, శుభ్రం చేస్తుంటారు.

దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌లో మరింత మురికి చేరుతుందని మీకు తెలుసా? దీని వల్ల ఫోన్ స్క్రాచ్ అయ్యే అవకాశాలున్నాయి.మొబైల్ ఫోన్ ఒక ఎలక్ట్రానిక్ పరికరం.

అందుకే దానిని వాడుతున్నప్పుడు వేడిగా మారుతుంది.ఫోన్‌పై కవర్‌ను ఉంచడం వల్ల దాని హీట్ విడుదల కాదు.

Advertisement
Benefits Of Using Mobile Without Cover Case Details, Mobile Phone,mobile Phone C

అది కూడా వేడెక్కుతుంది.అది వేడెక్కినప్పుడు దాని ప్రాసెసర్ ప్రభావితమవుతుంది.

ఇది నిరంతరం కొనసాగితే, మీ స్మార్ట్‌ఫోన్‌లో స్లో కావడం జరుగుతుంది.ఇలాంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచినప్పుడు, కొన్నిసార్లు అది వేడెక్కుతుండటాన్ని మీరు గమనించేవుంటారు.దానికి కవర్ ఉండటం వలన ఫోన్ వేడెక్కే అవకాశాలను పెంచుతుంది.

అలాగే ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది.మీ స్మార్ట్‌ఫోన్‌లో అధిక కరెంట్ సరఫరా కారణంగా ఇలా జరుగుతుంది.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

ఫోన్ వేడెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్ క్రమంగా తగ్గుతుంది.

Benefits Of Using Mobile Without Cover Case Details, Mobile Phone,mobile Phone C
Advertisement

స్మార్ట్‌ఫోన్ సిగ్నల్ రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తుంది.ఫోన్ ఎంత ఎక్కువ కవర్ అయితే దాని కారణంగా సెల్యులార్ నెట్‌వర్క్, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి రేడియో సిగ్నల్స్ బలహీనంగా మారుతాయి.దీని కారణంగా మీరు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కోవలసిరావచ్చు.

ఇప్పుడు మొబైల్ కవర్‌ను వాడటంతో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారు.అందుకే మీరు మీ మొబైల్‌ను కవర్ లేకుండానే ఉపయోగించండి.

ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా, పలు సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది.

తాజా వార్తలు