స‌మ్మ‌ర్‌లో ఈ స‌లాడ్ తీసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్!

స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అవుతోంది.ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

వేస‌వి కాలం వ‌చ్చిందంటే మండే ఎండ‌లు, వడగాడ్పులు, ఉక్క‌పోత‌ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి.

వీటిని త‌ట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అంటే క‌త్తి మీద సామే.

అందుకే స‌మ్మ‌ర్‌లో ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.ముఖ్యంగా డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను త‌ప్ప‌నిస‌రిగా చేర్చుకోవాలి.

అటువంటి వాటిల్లో గుమ్మ‌డికాయ స‌లాడ్ కూడా ఒక‌టి.అవును, స‌మ్మ‌ర్‌లో ఈ స‌లాడ్ తీసుకోవ‌డం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

Advertisement

విటమిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, నియాసిన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫోలేట్, ఫైబ‌ర్, ప్రోటీన్‌తో పాటు శక్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ గుమ్మ‌డికాయ‌లో పుష్క‌లంగా ఉంటాయి.అందువ‌ల్ల‌నే ఆరోగ్య ప‌రంగా ఇది ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా వేస‌వి కాలంలో త‌ర‌చూ గుమ్మ‌డికాయ‌తో స‌లాడ్‌ను త‌యారు చేసుకుని డైట్‌లో చేర్చుకుంటే.శ‌రీరానికి మంచి చ‌ల్ల‌ద‌నం అందుతుంది.

వేస‌వి వేడి వ‌ల్ల ఎదుర‌య్యే నీర‌సం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.అలాగే గుమ్మ‌డికాయ‌లో పోష‌కాలతో పాటు వాట‌ర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది.

అందువ‌ల్ల‌, దీనితో స‌లాడ్ చేసుకుని తీసుకుంటే.బాడీని డీహైడ్రేట్ అవ్వ‌కుండా కాపాడుకోవ‌చ్చు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారికీ గుమ్మ‌డికాయ స‌లాడ్‌ సూప‌ర్‌గా హెల్ప్ చేస్తుంది.మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ స‌లాడ్‌ను తిన‌డం వ‌ల్ల అతి ఆక‌లి కంట్రోల్ అవుతుంది.చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

Advertisement

ఫ‌లితంగా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదు, త‌ర‌చూ గుమ్మ‌డికాయ స‌లాడ్‌ను తీసుకుంటే.

కిడ్నీలో స్టోన్స్ ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.అధిక రక్తపోటు సమస్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.

కంటి చూపు పెరుగుతుంది.ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.

మ‌రియు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ సైత బ‌ల‌ప‌డుతుంది.కాబ‌ట్టి, ఈ స‌మ్మ‌ర్‌లో గుమ్మ‌డికాయ స‌లాడ్‌ను అస్స‌లు మిస్ చేయ‌వ‌ద్దు.

" autoplay>

తాజా వార్తలు