చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం ఆవాలులో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

ఆవాలు అనేవి వంటగదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.ఆవాల సాస్ ని వంటలలో రుచి కోసం వాడతారు.

హిప్పోక్రేట్ నాటి కాలంలో ఆవాలును వైద్య అనువర్తనాలుగా ఉపయోగించేవారు.తెలుపు, గోధుమ మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉండే ఆవాలును ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు.మనం ఇప్పటి రోజుల్లో ఆవాల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1.సహజమైన స్క్రబ్

ఆవాలు ఒక సహజమైన స్క్రబ్ అని చెప్పవచ్చు.దీనిలో లావెండర్ లేదా రోజ్ ఆయిల్ ని వేయాలి.ఈ స్క్రబ్ తో ముఖాన్ని శుభ్రం చేస్తే చర్మంలో మృత కణాలు తొలగిపోతాయి.

2.చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది

చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచటానికి ఆవాలు,కలబంద కలయక చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ఇది ముఖం నుండి మలినాలను తొలగించటమే కాక చర్మం లోపల పోషణను అందిస్తుంది.

3.వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది

అవాలులో కెరోటిన్ మరియు లుటీన్, విటమిన్ ఎ, సి మరియు K సమృద్దిగా ఉంటాయి.ఈ పోషకాలు అన్నీ కలిసి ఒక అద్భుతమైన యాంటి ఆక్సిడెంట్ గా తయారవుతుంది.

4.జుట్టు పెరుగుదల

ఆవాల గింజల నుంచి తీసిన ఆవాల నూనెలో విటమిన్ ఎ సమృద్దిగా ఉంటుంది.

విటమిన్ ఎ జుట్టు పెరుగుదల కోసం ఒక గొప్ప పోషకంగా ఉంది.అంతేకాక జుట్టు వేగంగా పెరగటానికి ఉద్దీపనను కలిగిస్తుంది.

5.జుట్టును బలోపేతం చేస్తుంది

ఆవాలులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ ఎ మరియు E, ఒమేగా -3 మరియు ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.ఇవన్నీ కలిసి లోపల నుండి జుట్టును బలోపేతం చేస్తాయి.

అంతేకాక జుట్టు రాలటాన్ని కూడా తగ్గిస్తాయి.

Advertisement
చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..

తాజా వార్తలు