గ్లిజ‌రిన్ ఫేషియ‌ల్‌..వారంలో ఒక్క‌సారి ట్రై చేస్తే మ‌స్తు బెనిఫిట్స్‌!

ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసి పోవాల‌ని చాలా మంది అమ్మాయిలు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్‌కి వెళ్లి ఫేషియ‌ల్ చేయించుకుంటారు.

ఈ క్ర‌మంలోనే వేల‌కు వేలు ఖ‌ర్చు పెడుతుంటారు.

కానీ, ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే గ్లిజ‌రిన్‌తో ఫేషియ‌ల్ చేసుకోవ‌చ్చు.గ్లిజ‌రిన్ ఫేషియ‌ల్‌ను ట్రై చేయ‌డం వ‌ల్ల ముఖం మెరిసి పోవ‌డ‌మే కాదు.

ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను సైతం పొందొచ్చు.మ‌రి లేట్ చేయ‌కుండా గ్లిజ‌రిన్‌తో ఫేషియ‌ల్‌ ఎలా చేసుకోవాలో చూసేయండి.

స్టెప్‌-1: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ గ్లిజ‌రిన్‌, నాలుగు స్పూన్ల రోజ్ వాట‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో ముఖానికి అప్లై చేసుకుని క్లిన్సింగ్ చేసుకోవాలి.నాలుగు, ఐదు నిమిషాల పాటు క్లిన్సింగ్ చేసుకుని అపై చ‌ల్ల‌టి నీటితో ఫేష్ వాష్ చేసుకోవాలి.

Advertisement

ఈ క్లిన్సింగ్ వ‌ల్ల స్కిన్ స్మూత్‌గా, హైడ్రేటెడ్‌గా మారుతుంది.మ‌రియు ట్యాన్ సైతం రిమూవ్ అవుతుంది.

స్టెప్‌-2: ఒక బౌల్‌లో రెండు స్పూన్ల షుగ‌ర్ పౌడ‌ర్‌, రెండు స్పూన్ల లెమ‌న్ జ్యూస్‌, ఒక స్పూన్ గ్లిజ‌రిన్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి స్మూత్‌గా మూడు, నాలుగు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకోవాలి.అనంత‌రం వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఈ స్క్ర‌బ్బింగ్ వ‌ల్ల డెడ్ స్కిన్ సెల్స్ పోయి చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.స్టెప్‌-3: ఒక బౌల్‌లో మూడు స్పూన్ల చంద‌నం పొడి, రెండు స్పూన్ల ప‌చ్చి పాలు, ఒక స్పూన్ గ్లిజ‌రిన్ వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుని.

ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.వారానికి ఒక సారి ఈ 3 స్టెప్స్‌ను ఫాలో అయితే గ‌నుక ముఖం వైట్‌గా, గ్లోగా మారుతుంది.

చ‌ర్మంపై మ‌చ్చ‌లు పొటిమ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు ముఖ చ‌ర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు