బ్లాక్ టీతో రోజును ప్రారంభిస్తున్నారా.. మరి మీకు ఈ విషయాలు తెలుసా?

ఇటీవల కాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది.

రెగ్యులర్ వర్కౌట్స్ తో పాటు హెల్తీ డైట్ ను మెయింటెన్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా రెట్టింపు అవుతుంది.

హెల్తీ డైట్ లో భాగంగానే చాలా మంది తమ రోజును బ్లాక్ టీ( Black tea ) తో ప్రారంభిస్తున్నారు.ఇది నిజంగా మంచి అలవాటనే చెప్పుకోవాలి.

పాలు, పంచదార కలపకుండా బ్లాక్ టీను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

బ్లాక్ టీ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

Advertisement

అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బ్లాక్ బెస్ట్ డ్రింక్ గా చెప్పుకోవచ్చు.రోజు ఉదయం ఒక కప్పు బ్లాక్ టీ తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది.

దాంతో క్యాలరీలు త్వరగా క‌రిగి వేగంగా మీరు బరువు తగ్గుతారు.

బ్లాక్ టీ పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది.అంతేకాదు రోజు బ్లాక్ టీ తాగితే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది.చేసే పనిపై ఫోకస్ పెరుగుతుంది.

ఒత్తిడి, అల‌స‌ట వంటివి దూరం అవుతాయి.మెదడు షార్ప్ గా పని చేస్తుంది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

అయితే బ్లాక్ టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.అతిగా తీసుకుంటే మాత్రం చెడు ప్రభావాలను చూపిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నాయి.

Advertisement

రోజుకు రెండు కప్పులకు మించి బ్లాక్ టీ ని తీసుకుంటే నిద్రలేమి బారిన పడతారు.జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది.

కడుపు నొప్పి.వాంతులు వంటివి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇక ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బ్లాక్ టీని అతిగా తీసుకుంటే మిస్ క్యారేజ్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది.అందుకే ప్రెగ్నెన్సీ టైంలో బ్లాక్ టీ ని అవాయిడ్ చేయడం మంచిది అని నిపుణులు అంటున్నారు.

తాజా వార్తలు