ఉగాది పండుగకు ముందే.. ఇంట్లో నుంచి వీటిని దూరంగా..

హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది చైత్ర మాసంలో శుక్లపక్షంలోని ప్రతిపద తిధి నుండి మొదలవుతుంది.చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజే మొదలవుతాయి.

ఈ సంవత్సరం ఉగాది ( Ugadi ) పండుగను మార్చి 22వ తేదీన జరుపుకుంటున్నారు.ఉగాది అంటే వారం రోజుల ముందే ప్రతి ఇంట్లో పరిశుభ్రత మొదలవుతుంది.

చెత్తాచెదారం తొలగించడం, రంగులు వేయడం, పండుగకు కావాల్సిన సామాగ్రిని ఇంటికి తెచ్చుకునే పనిలో మహిళలు బిజీగా ఉంటారు.ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఇంట్లో పనికి రాని వస్తువులను విసిరేయడం కూడా అంతే ముఖ్యం.

ఎందుకంటే కొన్ని వస్తువులు ఇంట్లో నెగెటివిటీని వ్యాప్తి చేస్తూ ఉంటాయి.కొంత మంది ప్రజల నిర్లక్ష్యం వల్ల వాటిని ఇంట్లోనే ఉంచుకుంటాం.

Advertisement

ఇలాంటివి ఇంట్లో ఎక్కువగా ఉంటే ఇంట్లో ప్రతికూలత పెరిగే అవకాశం ఉంది.కాబట్టి వాటిని కచ్చితంగా తొలగించాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవత విగ్రహాలను ( Goddess idols ) ఎప్పుడూ పగలగొట్టకూడదు.ఎందుకంటే విగ్రహం ఎక్కడైనా కాస్త విరిగిపోతే ప్రవహించే నీటిలో కలిపేయడమే మంచిది.లేకుంటే ఇంటికి అరిష్టం వస్తుంది.

ఇంకా ఇంట్లో ఆగిపోయిన గడియారం ఒక వ్యక్తి అదృష్టాన్ని కూడా ఆపేస్తుంది.అందువల్ల ఇంట్లో గడియారం పనిచేయడం మానేస్తే దానిని వెంటనే రిపేరు చేయించాలి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఎందుకంటే ఆగిపోయిన గడియారం వ్యక్తి పురోగతి ఆర్థిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన గాజు లేదా దానితో చేసిన వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

Advertisement

ఇది ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది.అందుకే గాజుకు సంబంధించి పగిలిపోయిన వస్తువులను ఇంట్లో ఉంచకపోవడం మంచిది.

ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మందులు ఉంటాయి.ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న పాత మందులను బయటపడేయడమే మంచిది.

ఎందుకంటే అవి ఇంట్లో ఉండడం ఇంటికి అరిష్టం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఇంట్లో పనికిరాని చెత్త పేపర్లు లేదా ఎలాంటి వస్తువులను అయినా ఉగాది పండుగకు ముందే బయట పడేయడం మంచిది.

తాజా వార్తలు