తెల్ల జుట్టును నల్లగా మార్చే బీట్ రూట్.. ఎలా వాడాలంటే?

బీట్ రూట్.అద్భుతమైన దుంపల్లో ఒకటి.

రుచికి తియ్యగా ఉండే బీట్ రూట్ లో ఎన్నో అమోఘమైన పోషకాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి.

ముఖ్యంగా తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు బీట్ రూట్ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మరి ఇంతకీ బీట్ రూట్ ను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక మీడియం సైజు బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత ఒక బౌల్‌ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ మరియు సరిపడా బీట్‌ రూట్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఒక రాత్రంతా వదిలేయాలి.

మ‌రుసటి రోజు అందులో ఎనిమిది టేబుల్ స్పూన్లు ఇండిగో పౌడర్ మరియు సరిపడా వాటర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల‌ వరకు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ ధరించాలి.షాంపూ చేసుకున్న జుట్టుకు మాత్రమే ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి.

రెండు గంటల అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఒక రోజు త‌ర్వాత మైల్డ్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.

ఇలా వారానికి ఒకసారి చేస్తే తెల్ల జుట్టు అస్సలు కనిపించదు.సహజంగానే వైట్ హెయిర్ నల్లగా మారుతుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

కాబట్టి ఎవరైతే వైట్ హెయిర్ సమస్యతో సత‌మతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు