ఫేషియ‌ల్ హెయిర్‌ను బీట్‌రూట్‌తో తొలిగించ‌వ‌చ్చు..ఎలాగో తెలుసా?

సాధార‌ణంగా కొంద‌రికి ఫేషియ‌ల్ హెయిర్(ముఖంపై అవాంఛిత రోమాలు) చాలా ఎక్కువ‌గా ఉంటుంది.దాంతో దాన్ని తొలిగించుకునేందుకు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లి ఎంతో ఖ‌ర్చు పెడుతుంటారు.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ఫేషియ‌ల్ హెయిర్‌ను రీమూవ్‌ చేసుకోవ‌చ్చు.అందుకు బీట్ రూట్ అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.

ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే బీట్ రూట్‌.ఆరోగ్యానికి కాదు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలోనూ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే ముఖంపై అవాంఛిత రోమాలను సైతం బీట్ రూట్ తొలిగించ‌గ‌ల‌దు.మ‌రి ఇంత‌కీ బీట్ రూట్ ను ఎలా ఉప‌యోగించాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Beetroot Helps To Remove Facial Hair Beetroot, Remove Facial Hair, Facial Hair,
Advertisement
Beetroot Helps To Remove Facial Hair! Beetroot, Remove Facial Hair, Facial Hair,

ముందుగా ఒక పెద్ద బీట్ రూట్‌ను తీసుకుని పీల్ తీసి శుభ్రం చేసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఆపై బీట్ రూట్ పేస్ట్ నుంచి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎర్ర కంది ప‌ప్పు పొడి, ఒక స్పూన్ ఓట్స్ పొడి, అర స్పూన్ పెస‌ర పిండి మ‌రియు స‌రిప‌డా బీట్ రూట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.కాస్త డ్రై అయిన త‌ర్వాత స్క్ర‌బ్ చేసుకుంటూ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా మూడు రోజుల‌కు ఒకసారి చేస్తే ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ రీమూవ్ అవ్వ‌డ‌మే కాదు చ‌ర్మం కాంతి వంతంగా కూడా మారుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ జొన్న పిండి, రెండు స్పూన్ల బంగాళా దుంప ర‌సం మ‌రియు మూడు స్పూన్ల బీట్ రూట్ ర‌సం వేసుకుని క‌లుపుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి పావు గంట అనంత‌రం మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా ఫేషియ‌ల్ హెయిర్ తొలిగి పోతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు