చెప్పులతో కొట్టుకుంటున్నారు.. కానీ వీడియో కాల్ లో..?

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మనం కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాం.

తద్వారా మనం వాడే పరికరాలను కూడా అడ్వాన్సడ్ గా తయారుచేసే ప్రజల ముందు ఉంచుతున్నారు.

ఈ తరహాలోనే ప్రతి మొబైల్ లో వీడియోకాల్ అందుబాటులో ఉంచడం ద్వారా దూరంగా ఉన్న తమ బంధువులను, పిల్లలను, స్నేహితులను వీడియో కాల్ చేసి ఒకరినొకరు చూసుకుంటూ పరామర్శించు కుంటున్నారు.అలాగే ప్రస్తుతం కరోనా పరిస్థితులవల్ల ప్రతి ఒక్క పనులు కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారానే జరుగుతున్నాయి.

మీటింగు నిర్వహించడం, తరగతి గదులను నిర్వహించడం, పరీక్షలు మొదలైనవాటిని ఆన్లైన్ ద్వారానే శిక్షణ ఇస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉంది కానీ.

ఆన్లైన్లో గొడవ పడటం ఎప్పుడైనా చూసారా? అది చెప్పులతో గొడవపడటం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి తరహా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇద్దరు వ్యక్తులు సాధారణంగా వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటుండగా, వారి మధ్య మాటల యుద్ధం పెరిగింది.

Advertisement

దీంతో వారిద్దరూ ఒకరినొకరు తీవ్రంగా దూషించు కుంటున్న నేపథ్యంలో సదరు ఒక వ్యక్తి ఏకంగా చెప్పు తీసి తన సెల్ ఫోన్ కెమెరా పై బాదాడు.అవతల వ్యక్తి తక్కువేమీ కాదంటూ అతను కూడా చెప్పు తీసి అతని ఫోన్ కెమెరా పై బలంగా కొట్టాడు.

ఇలా ఆన్లైన్లో వీరిద్దరి మధ్య చెప్పుల దాడి జరిగింది.వీరి గొడవ కాస్త సోషల్ మీడియాలో షేర్ అవడంతో వైరల్ గా మారింది.ఈ వీడియో ని చూసిన నెటిజన్లు ఇలా కూడా కొట్టుకోవచ్చా? అంటూ ఆ వీడియోని ట్రోల్ చేస్తున్నారు.వీరిద్దరి మధ్య గొడవ నచ్చడంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ చక్కెర్లు కొట్టేస్తోంది.

వీడియో కాల్స్ ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చా? అని సదరు నెటిజన్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియడం లేదు.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు