సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి లోన్,లాటరి పేరుతో వచ్చే మెసేజ్ లు కానీ,సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి ఆశపడి మోసపోకండి.NCRP portal (www.cybercrime.

gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారు.

లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా

:ఆధునిక సాంకేతిక హంగులున్న స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరికి చేతుల్లో ఉంటున్నాయి.ప్రస్తుత కాలంలో సామాన్యులకు సైతం స్మార్ట్ఫోన్లు కనీస అవసరాలయ్యాయి.

బ్యాంకు ఖాతాలతో ఫోన్ నంబర్లు అనుసంధానం కావడంతో యాప్ లు డౌన్లోడ్ చేసుకుని చాలామంది నగదు రహిత లావాదేవీలు కొనసాగిస్తున్నారు.ఓ వైపు డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తుండగా అంతే వేగంగా మరోవైపు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.

మొబైల్లో ఆటలు ఆడే సందర్భంలో, వివిధ రకాల సైట్లలో మనకు అవసరమైన వస్తువులు అతితక్కువ ధరకు లభిస్తాయని వచ్చే ప్రకటనలకు ఆకర్షితులైన వారు వెంటనే ఆ లింకు లపై క్లిక్ చేస్తున్నారు.దీంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

Advertisement

తక్షణమే ఆ మొబైల్ నంబరుకు అనుసంధానంగా ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు నేర గాళ్ల పరమవుతోంది.విషయం తెలుసుకునే సరికి సొమ్ము ఖాళీ కావడంతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుత రోజుల్లో అనేక సైబర్ మోసాలు బాగా పెరిగాయి.వీటి నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ నేరాల బారిన పడిన వెంటనే ఆలస్యం చేయకుండా సొమ్ములు తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 ను ఆశ్రయించాలి అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులల్లో జరిగిన కొన్ని సైబర్ కేసు వివరాలు.

■వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేస్బుక్లో గోల్డ్ కాయిన్స్ సంబంధిత ఒక ఆడ్ చూసి వాటిని కొనడానికి బాధితుడు జీఎస్టీ చెల్లించడానికి కొంత అమౌంట్ పంపించడం జరిగింది కానీ సస్పెక్ట్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దీని ద్వారా బాధితుడు 12300 నష్టపోయాడు.■సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి వాట్సాప్ లో ఒక మెసేజ్ రాగా అందులో ఒక లింక్ ని క్లిక్ చేసి కొన్ని ఆర్డర్స్ చేయడం ద్వారా అతనికి డబ్బులు వస్తుందని నమ్మి అందులో కొన్ని ఆర్డర్స్ చేశాడు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

తర్వాత అతను ఎలాంటి విత్ డ్రా ఆప్షన్ లేకపోవడంతో మోసపోయనని తెలుసుకున్నాడు.దీని ద్వారా బాధితుడు 5,36,000 రూపాయలు నష్టపోయాడు.

Advertisement

■ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలు వాట్సాప్ ఒక అన్నోన్ నెంబర్ నుండి ఒక జాబ్ లింక్ రావడం జరిగింది.ఆ లింక్ క్లిక్ చేయడంతో టెలిగ్రామ్ కి కనెక్ట్ అయింది టెలిగ్రామ్ లో వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా తన కొంత డబ్బు సంపాదించిన అనుకుంది కానీ అందులో నుండి నగదు విత్డ్రా చేసుకోవడానికి వీలు లేకపోవడంతో బాధితురాలు 5000 రూపాయలు నష్టపోయింది.

■సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలు ఇంస్టాగ్రామ్ నందు ఒక యాప్ సంబంధిత ఆడ్ చూసి రెండు లక్షల వరకు లోన్ సదుపాయం ఉంది అని నమ్మి చార్జెస్ కోసం అని చెప్పి కొంత డబ్బు పంపడం జరిగింది కానీ బాధితురాలికి ఎలాంటి లోన్ రాలేదు.దీని ద్వారా బాధితురాలు 17,850 రూపాయలు నష్టపోయింది.

■సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఓఎల్ఎక్స్ నందు ఒక వెహికల్ ఆడ్ చూసి అందులో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేయగా అతను ఆర్మీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి పోస్టర్ చార్జెస్ సంబంధించిన జిఎస్టి సంబంధిత అమౌంట్ అని బాధితుడి దగ్గర నుండి కొంత డబ్బు తీసుకున్నాడు.కానీ అతను ఎలాంటి వెహికల్ పంపడం జరగలేదు.

దీని ద్వారా బాధితుడు 28,050 రూపాయలు నష్టపోయాడు.■సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు టెలిగ్రామ్ గ్రూప్ నందు బిట్కాయిన్ ట్రేడింగ్ సంబంధిత ఒక వ్యక్తి దగ్గర ఇన్వెస్ట్ చేయాలని అనుకోని బాధితుడు అతనికి కొంత డబ్బు పంపడం జరిగింది కానీ సస్పెక్ట్ ఇలాంటి ట్రేడింగ్ చేయడం లేదు.

బాధితులు అతని డబ్బు అతనికి తిరిగి పంపమని అడగగా ఇంకా డబ్బు పంపాలని కోరడం జరిగింది.చివరికి బాధితులు మోసపోయాడని తెలుసుకున్నాడు.

దీని ద్వారా బాధితులు 61,900 రూపాయలు నష్టపోయాడు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-

• మీకు లాటరి వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.• లాటరి పేరుతో సైబర్ మోసాలు, అప్రమత్తంగా ఉండండి.

మీకు ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.

• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.

ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

• "ఇంస్టాగ్రామ్" లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండి, మోసపోకండి.

తాజా వార్తలు