కమలానికి విక్రమ్ గౌడ్ దూరం.. బీజేపీకి రాజీనామా చేసిన బీసీ నేత..!!

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.

కథ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడం తెలిసిందే.

దీంతో ఈ పార్లమెంట్ ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ బీసీ కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గానికి చెందిన దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్( Former minister Mukesh Goud ) కుమారుడు విక్రమ్ గౌడ్ తాజాగా బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది.తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై విక్రమ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ నుండి సరైన ప్రోత్సాహం లేదని పేర్కొన్నారు.

Advertisement

ఏదో కొద్ది మందికి అన్ని పదవులు అన్నట్టు వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.పార్టీని నమ్ముకున్న తనలాంటి వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రూపు రాజకీయాలు చేసేవారు బానే ఉన్నారని.

పార్టీలో కొత్త వారిని అంటరాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.క్రమశిక్షణ అంటూ పెద్దపెద్ద నాయకులు కొట్టుకుంటుంటే కొంతమంది చోద్యం చూస్తున్నారు.

పార్టీ బలోపేతం కోసం ఏమి ఆశించకుండా పనిచేసిన గుర్తింపు లేదు.ప్రజాబలం లేని నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి వారి కింద పనిచేయాలని చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విక్రమ్ గౌడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు