అద్దెకు తండ్రి.. అక్కడ ఇదొక ట్రెండ్.. ఎక్కడంటే..

మనకు చాలా వస్తువులు అద్దెకు దొరుకుతాయి.ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు బైక్ లు, కార్లు లాంటివి అద్దెకు ఇస్తారు.

కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి మనం చాలా వస్తువులను అద్దెకు తీసుకుని వాడుకోవచ్చు.అద్దెకిచ్చే వస్తువులకు గంటకు లేదా రోజుకు ధరలను నిర్ణయిస్తారు.

అయితే చివరకు నాన్నల్ని( Fathers ) కూడా అద్దెకు తీసుకోవచ్చట.ఇదెక్కడో కాదు.

చైనాలో( China ) మనుషులను కూడా అద్దెకు ఇస్తున్నారు.ఇటీవల అమ్మాయిలను అద్దెకు ఇవ్వడం గురించి మనం విన్నాం.

Advertisement

అయితే ఇప్పుడు నాన్నలను అద్దెకు ఇచ్చే సర్వీసులను కూడా ప్రారంభించారు.

డాడ్ ఆన్ రెంట్( Dad On Rent ) అనే సర్వీసులను చైనాలో ప్రారంభించారు.ఈ సర్వీస్ ద్వారా పిల్లల కోసం నాన్నల్ని అద్దెకు ఇస్తారు.చిన్నపిల్లలను కాసేపు ఆడించేందుకు నాన్నను అద్దెకు ఇస్తారట.

పిల్లల్ని నాన్నలాగానే వీళ్లు ఆడిస్తారు.వారిని ఎత్తుకుని కాసేపు సమయం గడుపుతారు.

ఒకరకంగా చెప్పాలంటే కాసేపు పిల్లలకు వీళ్లే నాన్న అయిపోతారు.షెన్యాంగ్‌లోని ఓ బౌత్హజ్ ఈ సర్వీసులను అందిస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేని వారికి ఈ నాన్నలను అద్దెకిచ్చే సర్వీసులు బాగా ఉపయోగపడుతున్నాయి.

Advertisement

అయితే ఈ సర్వీసులకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అసవరం లేదట.ఉచితంగానే ఈ సర్వీసులను వాడుకోవచ్చట.ఈ అద్దె నాన్నలు( Rented Fathers ) పిల్లలకు స్నానం చేయించడంతో పాటు ఫుడ్ తినిపించడం, పిల్లలు ఏడవకుండా ఆడించడం లాంటి పనులు చేస్తారు.

చైనాలోని బౌత్హజ్లలో చిన్నారులను తీసుకెళ్లడం చాలామంది తల్లులకు సమస్యగా మరారింది.అబ్బాయిలు వస్తే కంఫర్ట్‌గా ఫీల్ అవ్వరు.పిల్లల ముందు మసాజ్‌లు, పెడిక్యూర్లు చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది.

అందుకే బౌత్హజ్ నిర్వాహకులు నాన్నలను అద్దెకిచ్చే సర్వీసులను ప్రారంభించారు.ఈ సర్వీసులు బాగుండటంతో చాలామంది తల్లులు క్యూ కుడుతున్నారట.

తాజా వార్తలు