తెలంగాణ రాజకీయాలకు బర్రెలక్క గుడ్ బై చెప్పాల్సిందే.. ఆ తప్పులే మైనస్ అయ్యాయా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బర్రెలక్క( Barrelakka ) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగింది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బర్రెలక్కకు ఎంపీ ఎన్నికల్లో సైతం చేదు ఫలితాలే ఎదురయ్యాయి.ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్కకు కేవలం 3087 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) బర్రెలక్క సాధించిన ఓట్లతో పోల్చి చూస్తే తక్కువ కావడం గమనార్హం.మొత్తం పోలైన ఓట్లతో పోల్చి చూస్తే ఆమెకు వచ్చిన ఓట్లు కేవలం 0.25 శాతం కావడం హాట్ టాపిక్ అవుతోంది.ఈ ఎన్నికల ఫలితాలతో బర్రెలక్క తెలంగాణ రాజకీయాలకు( Telangana Politics ) గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి నెలకొందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తను చేసిన చిన్నచిన్న తప్పులే ఆమెకు మైనస్ అయ్యాయి.

Advertisement

బర్రెలక్క శిరీష( Barrelakka Sirisha ) సాధించిన ఓట్లతో పోల్చి చూస్తే నోటాకు వచ్చిన ఓట్లు ఎక్కువ కావడం కొసమెరుపు.బర్రెలక్క శిరీష ప్రజల మద్దతును పొందడంలో ఫెయిల్ అయ్యారని అందుకే ఆమెకు షాకింగ్ ఫలితాలు వచ్చాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బర్రెలక్క శిరీష మరో విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

బర్రెలక్క శిరీషకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో డొనేషన్ల రూపంలో భారీ మొత్తం అందాయి.బర్రెలక్క శిరీషకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 8 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.కొన్నిరోజుల క్రితం పెళ్లి చేసుకున్న శిరీష పెళ్లి తర్వాత అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

శిరీష రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ఏదో ఒక పార్టీలో చేరితే మంచిదని చెప్పవచ్చు.ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల శిరీష పేరు మాత్రం ఊహించని స్థాయిలో మారుమ్రోగింది.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు