ఒక తరం భవిష్యత్తును బారాస నాశనం చేసింది: ప్రధాని మోదీ

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన టిపిఎస్ఎస్సి లీక్ వల్ల పది సంవత్సరాలపాటు ఉద్యోగం కోసం ప్రిపేర్ అయిన యువత భవిష్యత్తు నాశనమైందని , తద్వారా ఒక తరం భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు ప్రధాని మోదీ.

( Narendra Modi ) ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కేసీఆర్ ( CM kcr )కు అహంకారం ఎక్కువ అని కేసీఆర్ ప్రభుత్వ మంత్రులలో కూడా ఆ ధోరణి కనిపిస్తుందని, ప్రజలు బారాస ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ చెప్పుకొచ్చారు.నాడు ఎల్బి స్టేడియంలోనే తాను ప్రధానమంత్రి అవ్వడానికి బీజం పడిందని నేడు మీ ఆశీర్వాదంతో బీసీ వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే ప్రక్రియకు ఇక్కడ నాంది పడుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు .

కాంగ్రెస్ బారసాలది ఒకే డిఎన్ఏ అని వారు తమ పిల్లలను అందలం ఎక్కించడం కోసమే పని చేస్తారు తప్ప మీ పిల్లల అభివృద్ధి కోసం పనిచేయరని, కేవలం భాజపా మాత్రమే బీసీల సంక్షేమానికి పనిచేస్తుందని, బీసీ వ్యక్తి ని అయిన తనను ప్రధానమంత్రిని చేసి గౌరవించిందని ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రిని కూడా బీసీ వ్యక్తిని చేస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మా మంత్రివర్గంలో 27 మంది బీసీ మంత్రులు ఉన్నారని, 85 మంది ఓబీసీఏ ఎంపీలు ఉన్నారని, 365 బిసి ఎమ్మెల్యేలు, 65 ఎమ్మెల్సీలు ఉన్నారని, అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసింది బిజేపి యే నని , దళితుడైన బాలయోగిని స్పీకర్ను చేసామని, దళితుడైన రామ్ నాధ్ కొవింద్, గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము9 Droupadi Murmu ) ను రాష్ట్రపతిని చేశామని, బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించామని, దంత, వైద్య కళాశాలలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని , సామాజిక న్యాయానికి కట్టుబడి బీసీ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నామని మోడీ చెప్పుకొచ్చారు.డిల్లీ మద్యం కేసులో బారాస నేతల పాత్ర ఉందని, దీనిపై విచారణ చేస్తుంటే విచారణ సంస్థలను, అధికారులను బారాస నేతలు దూషిస్తున్నారని ,అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టమంటూ మోడీ నినదించారు.

Advertisement
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాజా వార్తలు