తమిళంలో ఓకే.. మరి తెలుగులో?

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘బెంగళూరు డేస్‌’ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేయబోతున్నట్లుగా ఆ మధ్య తెగ ప్రచారం జరిగింది.

మలయాళంలో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆ చిత్రం మొదట తమిళంలో తెరకెక్కింది.

అక్కడ షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని రోజులకు తెలుగులో కూడా ప్రారంభం అవ్వనుంది అంటూ వార్తలు వచ్చాయి.దిల్‌రాజు ఈ రీమేక్‌కు రైట్స్‌ను దక్కించుకున్నారు.

కాని కారణాలు ఏమో తెలియదు కాని ఇప్పటి వరకు రీమేక్‌కు సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.అటు తమిళంలో ‘బెంగళూరు డేస్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తి అవ్వబోతుంది.

తాజాగా కొత్త సంవత్సరం కానుకగా ఫస్ట్‌లుక్‌ను సైతం విడుదల చేశారు.చూస్తుంటే అదే చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తమిళ వర్షన్‌లో హీరోలుగా ఆర్య, రానా, బాబీ సింహాలు నటిస్తున్నారు.హీరోయిన్‌గా శ్రీదివ్య నటించింది.

ఒక్క బాబీ సింహా తప్ప మిగిలిన వారు అంతా కూడా తెలుగులో ప్రముఖంగా పరిచయం ఉన్న వారే అవ్వడంతో డబ్బింగ్‌ చేసి వదిలినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

పీవీపీ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు.

39 ఏళ్లుగా విడుదలకు నోచుకోని అక్కినేని సినిమా..అలుపెరగని నిర్మాత పోరాటం
Advertisement

తాజా వార్తలు