తెలుగులో లేదా?

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన బెంగళూరు డేస్‌ సినిమాను తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేయాలనుకున్నారు.

ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాతలు అయిన దిల్‌రాజు మరియు ప్రసాద్‌ వి పొట్లూరిలు దక్కించుకున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా రీమేక్‌ తమిళంలో మొదలైంది.కాని తెలుగులో మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన లేదు.

దాంతో అసలు ఈ సినిమా తెలుగులో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.దిల్‌రాజు ఈ రీమేక్‌ రైట్స్‌ను తీసుకున్నప్పటికి ఎందుకు మొదలు పెట్టలేదు అనే విషయంలో పలు రకాల చర్చలు వస్తున్నాయి.

మొదట ఈ రీమేక్‌ను తెలుగులో సిద్దార్థ్‌ మరియు సమంతల జంటగా ప్రారంభించాలని ఏర్పాట్లు చేశారు.కాని కొన్ని కారణాల వల్ల వారిద్దరు కూడా ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నారు.

Advertisement

దాంతో తెలుగు వర్షన్‌ అలా ఆగిపోయిందని కొందరు అంటున్నారు.మరి కొందరు తెలుగు వర్షన్‌కు ఇంకా హీరోలు హీరోయిన్‌లు ఎంపిక కాలేదని, అందుకే ఆలస్యం అవుతుందని అంటున్నారు.

మొత్తానికి తెలుగులో ఈ సినిమా ఎప్పుడుంటుంది, అసలు ఉంటుందా లేదా ఎటూ తేలకుండా ఉంది.తమిళంలో ఆర్య, రానాలు హీరోలుగా నటించనున్నారు.

హీరోయిన్‌గా శ్రీదివ్యను ఎంపిక చేయడం జరిగింది.

39 ఏళ్లుగా విడుదలకు నోచుకోని అక్కినేని సినిమా..అలుపెరగని నిర్మాత పోరాటం
Advertisement

తాజా వార్తలు