పొంగులేటి బీజేపీ చేరికపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ చేరికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పొంగులేటి దగ్గరికి బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లారన్న సమాచారం తనకు తెలియదని చెప్పారు.

తన దగ్గర ఫోన్ లేదన్న బండి సంజయ్ అందుకే తనకు ఇప్పటిదాకా సమాచారం లేదని తెలిపారు.అయినా తనకు చెప్పకపోవడం తప్పేం కాదని పేర్కొన్నారు.

పొంగులేటి వస్తే ఆహ్వానిస్తామన్న ఆయన తెలంగాణ ప్రభుత్వంపై పోరాడేందుకు ఎవరినైనా కలుపుకుని పోతామని స్పష్టం చేశారు.తనకు తెలిసిన వాళ్లను తాను, ఈటలకు తెలిసిన వాళ్లను ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.

అందులో ఎలాంటి తప్పు లేదని వెల్లడించారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide