నేడు కరీంనగర్ లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర ముగియనుంది.

ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభను ఇవాళ నిర్వహించనున్నారు.

ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జాతీయ నేత జేపీ నడ్డా హాజరుకానున్నారు.మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు జేపీ నడ్డా రానున్నారు.విమానాశ్రయంలో బీజేపీ ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారని సమాచారం.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.అనంతరం జేపీ నడ్డా బహిరంగ సభకు హాజరుకానున్నారు.

Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!
Advertisement