బెయిల్‌ పై వచ్చిన బండి సంజయ్ తో బీజేపీ జాతీయ నాయకుల మాట ఏంటి?

10వ తరగతి పరీక్ష పత్రం లీకేజ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి బెయిల్‌ పై బయటకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌( Bandi Sanjay ) మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ పై( BRS ) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

బండి సంజయ్ జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా,( Amith Sha ) పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,( JP Nadda ) కేంద్ర మంత్రులు పలువురు ఇంకా జాతీయ నాయకులు కూడా బండి సంజయ్ ను ఫోన్‌ ద్వారా పరామర్శించినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వం బండి సంజయ్ కు ఇదే దూకుడు తో దూసుకు వెళ్లమంటూ గో అహెడ్‌ అంటూ హామీ ఇచ్చారని.

Bandi Sanjay Interesting Comments On Brs Details, Bandi Sanjay, Bjp, Brs, Kcr, M

ఏం జరిగినా కూడా మీ వెనుక బీజేపీ అధినాయకత్వం ఉందని గుర్తుంచుకోండి అన్నట్లుగా హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ప్రజా సమస్యలపై మరింత ఉదృతంగా ఆందోళనలు నిర్వహించాలని.ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం చేయాలని బీజేపీ నాయకత్వం బండి సంజయ్ కు మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది.

ఉదయం కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ బెయిల్‌ పై విడుదల అయిన వెంటనే భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు ఆయనకు ఆహ్వానం పలకడం జరిగింది.

Bandi Sanjay Interesting Comments On Brs Details, Bandi Sanjay, Bjp, Brs, Kcr, M
Advertisement
Bandi Sanjay Interesting Comments On BRS Details, Bandi Sanjay, Bjp, Brs, Kcr, M

కేసు విచారణకు సహకరించడంతో పాటు దేశం విడిచి వెళ్ల కూడదు అనే కండీషన్స్ పై బండి సంజయ్ కు బెయిల్‌ మంజూరు అయింది.రాత్రి సమయంలోనే బెయిల్‌ మంజూరు అయినా కూడా ఉదయం మాత్రమే ఆయన్ను పోలీసులు విడుదల చేయడం జరిగింది.బీఆర్‌ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కూడా బీజేపీ ని ఏం చేయలేరు అంటూ బండి సంజయ్ అన్నారు.

బీఆర్ఎస్‌ నాయకులు చేసిన లీకేజ్‌ వ్యవహారాన్ని కప్పి పుచ్చుకోవడానికి తమపై ఇలాంటి కేసులు ఆరోపణలు చేస్తున్నారు అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు