'అలయ్ బలయ్‌' కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించిన బండారు దత్తాత్రేయ..!!

హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అలయ్ బలయ్‌ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది ఈ కార్యక్రమానికి మంచు విష్ణు తో పాటు పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అయితే ఈసారి కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు బండారు దత్తాత్రేయ ఆయన కుమార్తె "అలయ్ బలయ్‌" ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి.ఈ సందర్భంగా చిరంజీవిని సన్మానించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ఇంటికి వచ్చి "అలయ్ బలయ్‌" కార్యక్రమానికి పండగ పూట తనని ఆహ్వానించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని .ఆశీస్సులు తీసుకుంటానని చిరంజీవి స్పష్టం చేశారు. అంతేకాదు "గాడ్ ఫాదర్" విజయం పట్ల కూడా చిరంజీవి మీడియా సముఖంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి సంతోషం వ్యక్తం చేశారు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు