నేడు జనసేనలోకి బాలినేని .. పవన్ పెట్టిన కండిషన్స్ ఏంటి ?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.

అయితే ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతుండడాన్ని టిడిపి నేత ,ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన ( తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జనసేనలో చేరబోతున్నట్లుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదస్పదం కావడం,  వాటిని తొలగించాల్సిందిగా ఫిర్యాదులు చేయడం,  ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను వదిలిపెట్టేది లేదని,  ఆయన ఏ పార్టీలో చేరినా జైలుకు వెళ్ళక తప్పదని దామచర్ల జనార్ధన్ వార్నింగ్ సైతం ఇచ్చారు.బాలినేని జనసేన లో చేరుతారా లేదా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.

  అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన లో చేరడం మంచిదనే అభిప్రాయానికి వచ్చిన బాలునేని ఈ మేరకు పవన్ కళ్యాణ్ తోను చర్చలు జరిపారు.

 ఇక ఈరోజు భారీ అనుచర గణం తో జనసేన లో చేరాలని బాలినేని భావించినా,  అందుకు జనసేన అధిష్టానం నిరాకరించింది.బాలినేని ర్యాలీకి అనుమతి కోరినా నిరాకరించారు.  దీంతో పార్టీలో చేరికపై బాలినేని కొంత బెట్టు చేసే ప్రయత్నం చేసినా,  జనసేన అధిష్టానం మాత్రం ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడంతో బాలినేని చేసేదిలేక ఏ హడావుడి లేకుండానే జనసేన లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

వాస్తవంగా జనసేన అధినేత ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఒంగోలుకు రప్పించి బల ప్రదర్శన నిర్వహించి , భారీ అనుచరుగణంతో ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని భావించారు.  అయితే ఆయన చేరికను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం,  ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్( Janardhana Rao Damacharla ) ఈ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో పాటు , పార్టీ మారినా,  గత పాపాల నుంచి బాలినేని తప్పించుకోలేరని బహిరంగంగానే విమర్శలకు దిగడం,  ఈ వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉన్న నేపథ్యంలో,  ఏ హడావుడి లేకుండానే బాలినేనిని చేర్చుకోవాలని జనసేన( Janasena ) అధిష్టానం నిర్ణయించుకుంది .

ఈ మేరకు అదే విషయాన్ని ఆయనకు తెలియజేశారు.ఇక ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్( Ravi Shankar ) కూడా నేడు జనసేన లో చేరనున్నారు.బాలినేని తో పాటు,  వైసీపీ కీలక నేతలు కొంతమంది జనసేనలో నేడు చేరనున్నారు .వారిలో సామినేని ఉదయభాను,  కిలారు రోశయ్య తదితరులు ఉన్నారు.ఈరోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వీరికి స్వయంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు.

Advertisement

తాజా వార్తలు