ఆ రాజకీయ నాయకుణ్ణి టార్గెట్ చేసిన బాలయ్య...

నటసింహం నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గత కొంతకాలంగా దూసుకుపోతున్నారు .వరుస సినిమాలు చేస్తూ .

అభిమానుల్లో జోష్ నింపుతున్నారు .ప్రస్తుతం బాలకృష్ణ తన 108వ చిత్రంలో నటిస్తున్నారు.అనిల్‌ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది .అఖండ వంటి భారీ విజయం తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు.తాజాగా ఈ సినిమా టైటిల్‌ గురించి సోషల్‌మీడియాలో పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ చిత్రానికి భగవంత్‌ కేసరి అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే ఐ డోంట్‌ కేర్‌ అన్నది ట్యాగ్‌ లైన్‌ అని చెబుతున్నారు.నందమూరి బాలకృష్ణ వరుసగా అఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు .అదే స్థాయిలో ఈ భగవంత్‌ కేసరి కూడా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు .బాలకృష్ణ కొత్త సినిమా కి సంబంధించిన టైటిల్ ని బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

అదే సందర్భంలో ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించడం మాత్రమే కాకుండా సినిమా నుండి ఒక వీడియో ని కూడా విడుదల చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఈ సినిమా కు చాలా పేర్లు వినిపించాయి.

చివరికి భగవంత్‌ కేసరి( Bhagwant Kesari ) అనే టైటిల్ ని కన్ఫామ్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే దీనిపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది .అయితే కొందరు అభిమానులు మాత్రం టైటిల్ లీక్ అవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి పై నందమూరి అభిమానులు గత కొన్నాళ్లుగా గరం గరం గా ఉన్నారు.

అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ కోపంగా ఉన్న వారికి ఇప్పుడు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.అయితే టైటిల్ విషయంలో అధికారిక ప్రకటన వచ్చేప్పటి వరకు పుకార్లను నమ్మవద్దని యూనిట్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

టైటిల్‌ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ ( Kajal Aggarwal )కథానాయికగా నటిస్తున్నది.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఇక ఇది ఇలా ఉంటే బాలీవుడ్‌ హీరో అర్జున్‌ రామ్‌పాల్‌( Arjun Rampal ) ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.తెలుస్తున్న స్టోరీ ప్రకారం ఇందులో విలన్ పాత్ర ప్రముఖ రాజకీయవేత్త అయిన కొడాలి నాని( Kodali Nani ) క్యారెక్టర్ నీ బేస్ చేసుకొని ఉంటుందని తెలుస్తుంది ఎందుకంటే కొడాలి నాని ఆ మధ్య టిడిపి పార్టీ ని, బాలయ్య ని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ చాలా రకాల కామెంట్లు చేశారు.కాబట్టి దానికి రివెంజ్ ఇక్కడ తీర్చుకో బోతున్నట్టు గా తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమా లో బాలయ్య రేంజ్ యాక్షన్‌తో పాటు తనదైన శైలి వినోదాత్మక అంశాలతో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.

తాజా వార్తలు