నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుండగా అభిమానులకు బాలయ్య మరో షాకిచ్చారు.
ఇప్పటికే మోక్షజ్ఞ( Mokshagna ) సినీ ఎంట్రీ ఆలస్యమవుతోందని ఫ్యాన్స్ ఫీలవుతుండగా ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ లేనట్టేనని ఆయన చెప్పుకొచ్చారు.
భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి ఎవరు డైరెక్టర్ అనే ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదని అన్నారు.గతంలో ఆదిత్య 999 మ్యాక్స్ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అని చెప్పిన బాలయ్య ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ విషయంలో నేను మెంటల్లీ అలా ప్రిపేర్ అవ్వనని పేర్కొన్నారు.
నేను ఏవీ ప్లాన్ చేయనని రేపు షూటింగ్ అంటే ఈరోజు కథ సిద్ధమవుతుందని బాలయ్య( Balakrishna ) చెప్పుకొచ్చారు.నాకు కథ సిద్ధం చెయ్యడానికి ఒక్క రాత్రి చాలని నేను అంత స్పీడ్ గా ఉంటానని నా స్పీడ్ ఎవరూ తట్టుకోలేరని బాలయ్య తెలిపారు.
మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి నాకు అస్సలు దిగులు లేదని నా దగ్గరే బోలెడు సబ్జెక్టులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ నాదే కావచ్చని లేదా రెండో మూవీ నాది కావచ్చని బాలయ్య చెప్పుకొచ్చారు.ఆదిత్య 999 మ్యాక్స్( Aditya 999 Max ) మాత్రం సిద్ధంగా ఉందని ఒక్కరాత్రిలో ఆ కథ సిద్ధం చేశానని కథ ఆసువుగా వచ్చేసిందని బాలయ్య కామెంట్లు చేశారు.
ఈ విధంగా నా దగ్గర మరో 5 కథలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మంచి దర్శకుడు దొరకాలని మాత్రమే కోరుకుంటున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు త్వరలో సమాధానం దొరకనుంది.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మోక్షజ్ఞను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా 2024లో అయినా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy