ఆ కార్య‌క్ర‌మంలో బాబు ఊసెత్త‌ని బాల‌య్య‌..! హిందుపురంలో ఎందుకు ఇలా..?

ఎన్టీఆర్ వార‌సుడు.అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌.

హిందుపురం ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు.గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్ లో కూడా హిందుపురంలో స‌త్తా చాటారు.

కానీ ఇప్ప‌టికీ ఆయన ఎమ్మెల్యే ద‌గ్గ‌రే ఆగిపోయారు.టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో గెలిచి 2014లో మొద‌టి సారి ఎమ్మెల్యే అయ్యారు.

అయితే ఆప్పుడే మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించినా.అది జరగలేదు.

Advertisement

కానీ.బాలయ్య అల్లుడు.

బాబు కుమారుడు లోకేష్ కి మంత్రి పదవి దక్కడంతో బాల‌య్య బాబు అక్క‌డికే స‌రిపెట్టుకున్నారు.ఇక 2019 ఎన్నికల్లో చూస్తే బాలయ్య ఇద్దరు అల్లుళ్లూ ఓడిపోయారు.

బాలయ్య మాత్రం జగన్ వేవ్ లో కూడా రెండోసారి హిందూపురం నుంచి గెలిచి సత్తా చాటారు.ఇక వైసీపీలో వర్గ పోరు అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.

బాలయ్య హవా కూడా బాగా ఉన్న హిందూపురంలో హ్యాట్రిక్ సాంధించేలా ఉన్నారు.ఇక తాజాగా బాల‌య్య బాబు తన నియోజకవర్గంలో నలభై లక్షలలతో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఈ ఆరోగ్య రథం వాహనం మీద ఎన్టీఆర్ ఫొటో ఒక వైపు.బాలయ్య ఫొటో మ‌రోవైపు ఉంది.

Advertisement

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటో మాత్రం క‌నిపించ‌లేదు.బాలయ్య కూడా బాబు గురించి ఎక్క‌డా ప్రస్తావించకపోవడం చ‌ర్చ‌నీయాంశంగా మ‌రింది.

ఏపీలో చంద్రబాబు పాలన రావాలని బాబును మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరని చెప్పుకునే బాలయ్య ఇప్పుడు క‌నీసం బాబు ఊసెత్త‌లేద‌ని అంటున్నారు.

ఇక ఆరోగ్య రథం విష‌యానికి వ‌స్తే హిందూపురంలోని మొత్తం అన్ని గ్రామాల్లో ఇది తిరుగుతుంది.ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తుంది.ఇందులో ఈసీజీతో సహా అక్సీమీటర్ మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఏర్పాటు చేసిన‌ట్లు చెబుతున్నారు.

దాదాపు 200 వైద్య పరీక్షలు ఇందులో చేసే వెసులుబాటు ఉంది.అలాగే 107 రకాల మందులు ఉచితంగా రోగులకు అందిస్తారు.

ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షలు అన్నీ ఉన్నాయి.మంచి వైద్యులు కూడా ఉన్నారు.

దీనికి బసకతారకం క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అటాచ్ చేసి మరిన్ని కొత్త సేవలు అందించాలని కూడా చూస్తున్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్ర మంత‌టా.?

అవకాశం ఉంటే ఏపీ అంతటా ఇలాంటి అరోగ్య రథాలను నడిపేలా చర్యలు తీసుకుంటామని కూడా బాలయ్య చెబుతున్నారు.తన భార్య వసుంధరతో కలసి ఆయన ఈ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు.

త‌న తండ్రి ఎన్టీఆర్ పేరు మీదుగానే ఈ కార్యక్రమం జరిపించిన‌ప్ప‌టికీ బాబు పేరు ఎక్క‌డా ప్ర‌స్తావ‌న‌కు రాక‌పోవ‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

తాజా వార్తలు