అల్లు అరవింద్ కోసమే అన్ స్టాపబుల్ చేశాను.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna ) ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు అన్ స్టాపబుల్ ( Un Stoppable ) అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ అయ్యారు.

ఇప్పటివరకు ఈ టాక్ షో 3 సీజన్లను పూర్తి చేసుకుంది.

ఇక త్వరలోనే  4 వ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది.  తాజాగా ఈ సీజన్ కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అన్ స్టాఫబుల్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్(Allu Aravind) తో పాటు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని( Tejaswini ) కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తనను పలు షోలకు హోస్ట్‌ గా, యాంకర్‌ గా, జడ్జ్‌ గా సంప్రదించారు.కానీ తాను మాత్రం ఎలాంటి షోలకు కమిట్ అవ్వలేదు కానీ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి మాత్రమే ఓకే చెప్పానని వెల్లడించారు.

ఈ టాక్ షో చేయటానికి ప్రధాన కారణం అల్లు అరవింద్ గారేనని, ఆయన కోసమే ఈ టాక్ షో చేస్తున్నానని బాలకృష్ణ తెలిపారు.చరిత్ర రాయాలన్నా మేమే, దానిని తిరగ రాయాలన్నా మేమే అంటూ తనదైన శైలిలో బాలయ్య స్టేజ్ పై మాట్లాడుతూ అన్‌ స్టాపబుల్‌ మరోసారి కచ్చితంగా సక్సెస్ అవుతుందని బాలయ్య తెలిపారు.ఇక ఈ కార్యక్రమానికి ఎవరు అతిథులుగా రాబోతున్నారు, బాలయ్య వారిని ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం బాబి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా అనంతరం బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు