అంతరిక్షంను ఆటాడేసుకుంటామంటున్న బాలయ్య ఫ్యాన్స్‌... బాబు గారు ఎంత పని చేశారండి

మెగా బ్రదర్‌ నాగబాబు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య గురించి తనకు తెలియదు అని, అసలు బాలయ్య ఎవరో నాకు తెలియదు, బాలకృష్ణ పేరు కూడా తాను ఎప్పుడు వినలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆ వివాదం రాజుకుని నాగబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలోనే వివాదాన్ని లాగేలా బాలకృష్ణ నాకు తెలుసు ఆయనో పెద్ద కమెడియన్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇలా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో నందమూరి ఫ్యాన్స్‌ అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా ఉడికి పోతున్నారు.

నాగబాబు వ్యాఖ్యలకు పగ తీర్చుకునేందుకు నందమూరి ఫ్యాన్స్‌ సమాయత్తం అవుతున్నారు.ఆయన కొడుకు వరుణ్‌ తేజ్‌ నటించిన ‘అంతరిక్షం’ మూవీ త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా విడుదల సమయంలో తమ సత్తా ఏంటో నాగబాబుకు తెలుస్తుందని, అప్పుడు బాలకృష్ణ ఎవరో ఆయనకే అర్థం అవుతుంది, బాలకృష్ణ గురించి మరోసారి మాట్లాడకుండా చేస్తామంటూ నందమూరి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హెచ్చరిస్తున్నారు.

అంతరిక్షం మూవీ విడుదల సమయానికి నాగబాబు ఖచ్చితంగా బాలయ్య బాబుకు క్షమాపణలు చెప్పాలని, బాలకృష్ణ గురించి తాను చేసిన విమర్శలను వెనక్కు తీసుకోవాలంటూ నాగబాబును నందమూరి ఫ్యాన్స్‌ హెచ్చరించారు.లేదంటే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.అంతరిక్షం మూవీకి ఫస్ట్‌ డే నుండి బ్యాడ్‌ టాక్‌ను భారీ ఎత్తున పబ్లిసిటీ చేయాలని నందమూరి ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

Advertisement

అందుకోసం గ్రౌండ్‌ వర్క్‌ కూడా జరుగుతుందట.మరి నాగబాబు తన కొడుకు సినిమా గురించి ఏమైనా ఆలోచించి బాలయ్య విషయంలో మాట మార్చుతాడా అనేది చూడాలి.

సీఎం కాన్వాయ్‌లో వాహనాల కుదింపు యోచన?
Advertisement