బాహుబలి, ఆర్ఆర్ఆర్, ధమాకా.. రవితేజ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరిందా?

గత కొన్నేళ్లలో థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య ఊహించని స్థాయిలో తగ్గింది.ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమాల కలెక్షన్లు అమాంతం తగ్గుతున్నాయి.

ఈ రీజన్ వల్లే ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయడంపై మేకర్స్ దృష్టి పెడుతున్నారు.10 రోజుల్లో ధమాకా మూవీ ఏకంగా 89 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.10వ రోజు ఈ సినిమా ఏకంగా 3.5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.బాహుబలి, బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాల తర్వాత పదో రోజు ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న మూవీ ఏదనే ప్రశ్నకు ధమాకా పేరు సమాధానంగా వినిపిస్తోంది.వాస్తవానికి ధమాకా సినిమాకు వచ్చిన టాక్ కు ఈ సినిమా సాధించిన కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదనే సంగతి తెలిసిందే.

అయితే అదృష్టం కలిసొచ్చి ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సాధ్యమైంది.శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు ఈ సినిమా భారీ లాభాలను అందిస్తోంది.ఈ సినిమాలోని మాస్ పాటలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

శ్రీలీల డ్యాన్స్ లు కూడా ఈ మూవీ సక్సెస్ కు కారణమయ్యాయి.మాస్ ప్రేక్షకులకు నచ్చితే రొటీన్ కథలతో కూడా సక్సెస్ సాధించవచ్చని ధమాకా మూవీతో రవితేజ మరోసారి ప్రూవ్ చేశారు.

Advertisement

ఈ సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.పదో రోజు ధమాకా సాధించిన షేర్ కలెక్షన్లతో రవితేజ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు