బహు పరాక్! ఆండ్రాయిడ్ ఫోన్లలో వైరస్... కాల్ రికార్డ్స్, కెమెరాను సైతం హ్యాక్ చేసేస్తోంది!

ఆండ్రాయిడ్ యూజర్లారా బహు పరాక్! ఇపుడు మీ ఫోన్‌లకు హాని కలిగించే డామ్( Damn ) అనే మాల్‌వేర్‌పై కేంద్ర ప్రభుత్వం ఓ వార్నింగ్ ఇచ్చింది.

ఈ వైరస్, మీ కాల్ రికార్డ్‌లు, హిస్టరీ మరియు కెమెరాల ను హ్యాక్ చేయగలదని, చేస్తోందని ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది.

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన CERT-Inలో ఈ విషయాలను తెలిపింది.ఈ డామ్ వైరస్ యాంటీ-వైరస్( Anti-virus ) ప్రోగ్రామ్‌లకు కూడా దొరకకుండా తప్పించుకోగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Bahu Parak Virus In Android Phones Is Hacking Call Records And Camera Too, Vir

అంతేకాకుండా అది టార్గెట్ చేసిన పరికరాల్లో ransomwareని తేలికగా ప్రవేశ పెట్టగలదు అని చెబుతున్నారు.ఆండ్రాయిడ్ ఫోన్‌లో అదివరకే వున్న సెక్యూరిటీ చెక్‌ను సైతం అది ఛేజించి, కాల్ రికార్డ్‌లు మరియు హిస్టరీ వంటి సున్నితమైన డేటాలోకి దూరి డామ్ వైరస్ హ్యాక్ చేస్తుందని అంటున్నారు.అదేవిధంగా కాల్ రికార్డింగ్‌లు, కాంటాక్ట్‌లను( Call recordings, contacts ) హ్యాక్ చేయడం, కెమెరా యాక్సెస్‌ల పాస్‌వర్డ్‌లను సవరించడం కూడా ఈ డామ్ వైరస్ చేయగలదని ప్రభుత్వ సలహాదారు తాజా ప్రకటనలో తెలిపింది.

Bahu Parak Virus In Android Phones Is Hacking Call Records And Camera Too, Vir

ఇది మాత్రమే కాకుండా ఈ వైరస్ మీకు తెలియకుండానే స్క్రీన్‌షాట్ తీసివేస్తోందని కూడా అంటున్నారు.SMSలను దొంగిలించడం కావచ్చు, ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం, అప్‌లోడ్ చేయడం మొదలైన పనులను మన ప్రమేయం లేకుండానే చేస్తోందని కనుగొన్నారు.ఇక ఇటువంటి వైరస్ దాడులను నివారించడానికి మీరు తీసుకోవాల్సిన ఒకే ఒక్క జాగ్రత్త ఏమంటే, "విశ్వసనీయ వెబ్‌సైట్‌లను" మాత్రమే బ్రౌజ్ చేయాలి.

Advertisement
Bahu Parak! Virus In Android Phones Is Hacking Call Records And Camera Too, Vir

లేదా "విశ్వసనీయ లింక్‌లు"పై క్లిక్ చేయడం ఎంతో సురక్షితం.

బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు