బేబీ( Baby movie ) వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.ఒక వైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న కూడా వాటిని లెక్కచేయకుండా బేబీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
ఎంతలా అంటే చూస్తుంటే ఈ సినిమాను 100 కోట్ల క్లబ్ లో చేర్చడానికి సిద్ధం అవుతున్నట్టు అనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ బేబీ మూవీ హవా నడుస్తుంది.
యూత్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ వారం రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ఎంతో చూద్దాం.
ఈ సినిమా 6 రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే.యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాతో ఎట్టకేలకు ఒక హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మరింత మంచి టాక్ తో దూసుకు పోతుంది.
ఈ సినిమా 6 రోజుల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ ( Sai rajesh )తెరకెక్కించాడు.
జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా వీకెండ్ తో పాటు వర్కింగ్ డేస్ లో కేసుల ఫుల్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇక 6 రోజుల్లో 43.8 కోట్ల గ్రాస్ ను రాబట్టి అతి త్వరలోనే 50 కోట్ల సెన్సేషనల్ మార్క్ ను టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది.ఈ ఈ వారం కూడా అంతగా ఆకట్టుకునే సినిమాలు రిలీజ్ కావడంతో లేదు.
దీంతో సెకండ్ వీక్ కూడా బేబీ హవానే కొనసాగనుంది.చూడాలి మరి ఈ సినిమా 100 కోట్ల మార్క్ చేరుకుంటుందో లేదో.
కాగా ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా.విజయ్ బుల్గానిస్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy